వామ్మో.. లింగుస్వామి సినిమాకి బన్నీ పారితోషకం అంతా..?!

Allu Arjun remuneration for Lingusamy movie

04:19 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Allu Arjun remuneration for Lingusamy movie

పారితోషికం కింద ఏదైనా హీరోలు ఒక ఏరియా రైట్స్ తీసుకోవడం అన్నది తెలుగు సినిమాల్లో ఎప్పట్నుంచో ఉన్నదే. మెగాస్టార్ చిరంజీవి ఆ రోజుల్లోనే నైజాం హక్కుల్ని పారితోషకం కింద తీసుకునేవాడు. ఇప్పుడు కూడా కొందరు స్టార్ హీరోలు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమాకు పారితోషకంగా నైజాం ఏరియా రైట్స్ తీసుకుంటున్నాడట. గత కొన్నేళ్లలో మార్కెట్ బాగా పెంచుకున్న బన్నీ.. ఇప్పుడు నైజాంలో సూపర్ స్టార్ అయ్యాడు. అతడి సినిమాలు ఈజీగా రూ.15 కోట్ల దాకా వసూలు చేస్తున్నాయి ఇక్కడ. రైట్స్ కూడా రూ.14-15 కోట్ల మధ్య పలుకుతున్నాయి.

మామూలుగా అయితే బన్నీకి అంత పారితోషకం ఇవ్వట్లేదు. అయితే లింగుస్వామితో చేసేది ద్విభాషా చిత్రం.. పైగా 'సరైనోడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఊపు మీదున్నాడు. అందుకే అతడికి పారితోషకం కింద నైజాం రైట్స్ ఇచ్చేయడానికి ఓకే చెప్పేశాడు నిర్మాత జ్నానవేల్ రాజా. ఈ వార్త వాస్తవమైతే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల తర్వాత తెలుగులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరో బన్నీనే అవుతాడు. వచ్చే నెలలోనే హరీష్ శంకర్ సినిమా మొదలుపెట్టబోతున్న బన్నీ.. లింగుస్వామి సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: అసలు గోత్రం అంటే ఏంటి? ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా?

ఇది కూడా చదవండి: మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో తెలుసుకోండిలా..

ఇది కూడా చదవండి: ఒక్కరోజులో అతిగా శృంగారం చెయ్యడం వల్ల కలిగే నష్టాలు

English summary

Allu Arjun remuneration for Lingusamy movie. Allu Arjun want to take Nizam rights for Lingusamy movie.