సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం

Allu Arjun Sarainodu Promotion At Bangalore

10:08 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Allu Arjun Sarainodu Promotion At Bangalore

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన సరైనోడు. సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా కథానాయకుడు అల్లు అర్జున్ గురువారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కన్నడ భాషలో మాట్లాడడంతో... అభిమానులు విజిల్స్, కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు.

ఇవి కూడా చదవండి: ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష

‘‘నాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తెలుగు తర్వాత కర్ణాటకలో ఉన్న అభిమానులు ప్రత్యేకం. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతీ ఒక్క మెగాభిమానికి, ప్రేక్షకులకు ఏంతో రుణపడి ఉంటా. నా చిత్రాలు ఇక్కడ ఆడుతున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కన్నడ చిత్రాల్ని నేను ఎంతో గౌరవిస్తా. మూడు సంవత్సరాలుగా కన్నడ చిత్రాల్లో ఎంతో పురోగతి కనిపిస్తోంది. చాలా మంచి చిత్రాలొస్తున్నాయి. నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా. నాకు రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. త్వరలోనే తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయబోతున్నా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం. సరైనోడు పూర్తి స్థాయి మాస్ ఫ్యామిలీ, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ . డైరెక్టర్ బోయపాటి అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. నా కోసం ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. అభిమానులతో పాటు, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను’’. అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

నిహారిక చేతిలో ఓడిన పవర్ స్టార్

నాగ్ పై పూల వర్షం.. భారీ ఫాలోయింగ్

English summary

Stylish Star Allu Arjun's Sarainodu movie was released across the world today. Yesterday Allu Arjun attended to a promotion event which was organised in Banglore. He said that he was very happy to come Banglore and his Aim was to become a good actor in South Film industry.