బాహుబలి కలెక్షన్స్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్

Allu Arjun Shocking Comments On Bahubali

10:17 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Allu Arjun Shocking Comments On Bahubali

ఈ సమ్మర్ లో ఓపెనింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరైనోడుతో తన స్థాయికి తగిన సరైన సక్సెస్ సాధించిన అల్లు అర్జున్.. ఇంకా తను పూర్తి అవకాశాలను ఉపయోగించుకోలేదని అంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లలో మోస్ట్ ప్రామిసింగ్ గా అవతరించిన బన్నీ.. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. అల్లు అర్జున్ సినిమాలకు మలయాళంలో సూపర్ మార్కెట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:కన్యాకుమారికి కొత్త పేరు

ఇదే స్థాయిలో మొత్తం దక్షిణాదిలో పాగావేసేందుకు బన్నీ ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని లింగుస్వామితో చేయబోతున్నట్టు టాక్. 'ఇతర రాష్ట్రాలపై ఇన్నాళ్లూ మనం పెద్దగా దృష్టి పెట్టలేదు. బాహుబలి మూవీ తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో రిలీజ్ కాబట్టే రూ. 200 కోట్ల కంటే ఎక్కువగా వసూలు సాధించింది. బై లింగ్యువల్స్ కు మార్కెట్ ఎక్కువనే విషయం మనోళ్లు ఆలస్యంగా గ్రహించారు" అంటున్నాడు బన్నీ.

'తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో నా సినిమా టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉండాలని కోరుకున్నా. తెలంగాణలోను - ఓవరాల్ గాను ఈ ఫీట్ సాధించగలిగినా.. ఇప్పటివరకూ ఏపీలో సాధ్యం కాలేదు. కానీ సరైనోడుతో అది కూడా అందుకున్నా. చాలా ఏరియాల్లో బాహుబలి తర్వాత హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా సరైనోడు రికార్డు సృష్టిస్తోంది' అని అల్లు అర్జున్ అంటున్నాడు. క్రిటిక్స్ మెచ్చుకోకపోయానా సినిమాకి ప్రేక్షకుల ఆదరణ లభించడానికి.. సరైనోడు యూనిట్ పడ్డ కష్టమే కారణం అని అనడంతో యూనిట్ మొత్తం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఇవి కూడా చదవండి:మళ్లీ అదే తప్పు చేస్తున్న పవన్

ఇవి కూడా చదవండి:విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేసిన కబాలి

English summary

Tollywood Stylish Star Allu Arjun was presently enjoying the success of his latest Super Hit Sarainodu Movie. Allu Arjun says that Bahubali Movie collected such huge collections because of it was released in Many Languages.