నైట్ క్లబ్ ల్లో బన్నీకి పనేమిటి?

Allu Arjun starting night club business

03:20 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Allu Arjun starting night club business

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో తనకంటూ సుస్ధిర స్థానం ఏర్పరచుకున్న నేపథ్యంలో ఇలా నైట్ క్లబ్ ల్లో అడుగు పెట్టడమేమిటని అనుకుంటున్నారా? పైగా ఇదేమీ రీల్ లైఫ్ కానేకాదు, రియల్ లైఫ్ లోనే... అయితే ఓ సారి వివరాల్లోకి వెళ్ళాసిందే.. ఇప్పటికే హిట్ చిత్రాలతో స్టార్ డమ్ చూవిచూసిన ఈ స్టార్ హీరో, బిజినెస్మెన్ గా మారడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే టాలీవుడ్ లో తన కో స్టార్స్ వ్యాపార రంగలోకి అడుగుపెట్టి రెండు చేతులా సంపాదిస్తున్ననేపథ్యంలో బన్నీ కూడా బిజినెస్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఆలోచనకు తగ్గట్లు ఆచరణ కూడా మొదలుపెట్టాడు బన్నీ.

హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యాన్ని రుచి చూపేందుకు 'ఎమ్ కిచెన్, కేదార్ శెలగం శెట్టి' వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్ లను ప్రారంభించనున్నట్టు తెలిపాడు. '800జూబిలీ' అనే క్లబ్ పెడుతున్నాం అని చెప్పుకొచ్చాడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో రానున్న ఈ క్లబ్ లో జపనీస్ రెస్టారెంట్, కేఫ్ తో పాటు బార్బి క్యూ రెస్టారెంట్ వగైరా ఉంటాయన్నాడు. ఇప్పటికే క్లబ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు కూడా పూర్తయింది. ఇక ఈ నెల 29న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి బన్నీ బిజినెస్ లోకూడా రాణించాలని ఇటు కుటుంబం, అటు అభిమానులు కోరుకుంటున్నారు.

English summary

Allu Arjun starting night club business