ఆ కోరికా తీర్చేస్తున్న  బన్నీ  

Allu Arjun To Sing Song In His Next movie

03:50 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Allu Arjun To Sing Song In His Next movie

తెలుగులో టాప్ స్టార్స్ సింగర్స్‌గా మారి తమ సినిమాల్లో పాటలు పాడి అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చిన సందర్భాలు చాలానే వున్నాయి. అయితే ఇప్పుడొస్తున్న కుర్ర హీరోలలో యాక్టింగ్ తో పాటూ అడపాదడపా పాటలతో సందడి చేస్తున్న ఎన్టీఆర్ ఓ క్రేజ్ తెచ్చుకుంటే, ఇక తానూ తక్కువ తినలేదన్నట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూడా అదే బాట పట్టాడు. బన్నీకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తనదైన మ్యానరిజమ్, యాక్టింగ్‌తో ఎపి , తెలంగాణా అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాక సౌతిండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బన్నీ వసూళ్ళలో కూడా దూసుకు పోతున్నాడు. తాజాగా ఎప్పట్నుంచో తన అభిమానుల అభిలాషగా ఉంటూ వస్తోన్న ఆ కోరిక తీర్చేందుకు రెడీ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్.. ఇలా టాప్ స్టార్స్ తమ సినిమాల కోసం గళం విప్పి అభిమానులకు అమితానందం అందిస్తే, అదే కోవలో అల్లు అర్జున్ చేరిపోతున్నాడు.

ప్రస్తుతం బన్నీ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ‘సరైనోడు’ విడుదల కానుంది. అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ అభిమానుల కోసం పాడేసున్నాడు . సంగీత దర్శకుడు థమన్ అల్లు అర్జున్ కోసం ఓ సూపర్ ట్యూన్‌ను సిద్ధం చేసి, ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం బన్నీ గొంతు కలుపు తున్నాడు. ఇప్పటికే డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్‌తో అభిమానులని విపరీతంగా అలరించిన బన్నీ, పాట కూడా పాడేసి, ఏ రేంజ్‌లో దూసుకుపోతాడో చూడాలి .

English summary

Tollywood stylish star Allu Arjun has a huge following in South India. Now a days all the heroes were singing songs in their films and now Allu Arjun was also to sing a song in his next movie sarainodu.