బన్నీకి సూపర్ స్టార్ తో నటించాలని ఉందట!

Allu Arjun want to act with Mohanlal

11:45 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Allu Arjun want to act with Mohanlal

సరైనోడు హిట్ కావడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మరో ఆనందం వచ్చేసింది. అతడికి ఎంతో క్రేజ్ ఉన్న మలయాళ ఇండస్ట్రీలో కూడా సరైనోడు సూపర్ హిట్ కావడంతో బన్నీ డబుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ మలయాళ ఇండస్ట్రీ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తనకు మలయాళ సినిమాలు అంటే చాలా ఇష్టమని.. తాను తప్పకుండా ఓ స్ట్రెయిట్ మూవీ చేస్తానని చెప్పాడు. అంతే కాకుండా మలయాళంలో తనకు ఇష్టమైన నటుడు ఎవరో కూడా అల్లు అర్జున్ చెప్పేసాడు. తనకు చిన్నప్పటి నుండీ సూపర్ స్టార్ మోహన్ లాల్ అంటే ప్రత్యేక అభిమానం అంటూ బన్నీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇక తాను ఒక్కసారైనా మోహన్ లాల్ పక్కన నటించాలని ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా బన్నీ తెలియజేశాడు. త్వరలోనే తన కోరిక తీరుతుందని భావిస్తున్నానని బన్నీ చెప్పుకొచ్చాడు. మరి బన్నీ అనుకున్నట్లుగా మోహన్ లాల్ తో సినిమా తీస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి అల్లువారి అబ్బాయ్ కి భలే కోరిక వుంది కదా.

English summary

Allu Arjun want to act with Mohanlal