బిజినెస్ స్టార్ట్ చేసిన బన్నీ వైఫ్!

Allu Arjun wife Sneha Reddy started a new business

11:09 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Allu Arjun wife Sneha Reddy started a new business

తన సినిమాలతో పక్కా ప్లాన్ గా దూసుకెళుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తగ్గట్టే అతని భార్య స్నేహారెడ్డి కూడా తనదైన శైలిలో వ్యాపార రంగంలో అడుగు పెట్టింది. హైదరాబాద్ లో పికాబో పేరుతో ఫోటో స్టూడియో ప్రారంభించడంతో బన్నీ, చాలా ఖుషీగా ఉన్నాడు. తన సంతోషాన్ని బాహాటంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పికాబో ఫోటో స్టూడియో ప్రతీ ఒక్కరి అద్భుతమైన క్షణాలను ఫోటోల రూపంలో అందిస్తోందని ట్విట్టర్ లో తెలిపాడు. అలాగే పికాబో స్టూడియోలో తీసిన కొన్ని ఫోటోల కలెక్షన్ ఆయన పోస్ట్ చేశారు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా షూటింగులో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన సంతోషాన్ని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పంచుకున్నాడు. మొత్తానికి ఇరువైపులా సంపాదన స్టార్ట్ అయిందన్న మాట.

ఇది కూడా చదవండి: బిడ్డను కన్నాడు.. పాలిస్తున్నాడు..

ఇది కూడా చదవండి: హమ్మయ్య ట్విన్స్ పుట్టేసారు ...

ఇది కూడా చదవండి: రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

English summary

Allu Arjun wife Sneha Reddy started a new business. Stylish Star Allu Arjun wife Sneha Reddy started new business in Hyderabad.