అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన అయాన్

Allu Ayaan gave shock to Allu Arjun

11:25 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Allu Ayaan gave shock to Allu Arjun

స్టైలిష్ స్టార్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడంటే, ఆన్ లైన్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోస్ లో అతనిదే ఫస్ట్ ప్లేస్. అయితే, అల్లు అర్జున్ కన్నా అతని కొడుకు అయాన్ మించిపోయాడు. ఇది ఏ స్థాయిలో అంటే.. తండ్రి బన్నీకే షాక్ ఇచ్చే విధంగా. ఐ ఫోన్‌లోని సర్దార్ పాటలను బన్నీ ట్విట్టర్ ఖాతాలో బుడతడు అల్లు అయాన్ పోస్ట్ చేశాడట. అలా చేయడానికి తనకైతే 10 నిమిషాల సమయం పడుతుందని.. కానీ దాన్ని సులువుగా కొడుకు ఆయాన్ ఎలా పెట్టాడని బన్నీ ఆశ్చర్యపోయాడు. అందుకే ఇక మీదట అయాన్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ ట్వీట్ చేశాడు.

అవి సర్దార్ గబ్బర్‌సింగ్ పాటలు కాబట్టి సరిపోయింది. అదే వేరెవరి పాటయినా అయితే ఏమయ్యేదోనని బన్నీ భార్య స్నేహ అందట. ఈ సరదా సన్నివేశాన్ని బన్నీ అభిమానులతో పంచుకున్నాడు. బన్నీ సోషల్ మీడియాలో ఈ విషయం అలా పెట్టాడో లేదో వెంటనే కామెంట్ల వర్షం..... తండ్రికి జూనియర్ అరవింద్ షాకిచ్చాడని, బుడతడు తాతను మించిన గడుగ్గాయంటూ బన్నీకి రిప్లై ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇక సినీ రంగంలో కూడా ఎంట్రీ ఇస్తే ఎలా వుంటుందో చూడాలి మరి.

English summary

Allu Ayaan gave shock to Allu Arjun. Allu Arjun son Allu Ayaan gave shock to Allu Arjun by uploading Sardar Gabbar Singh movie songs in twitter.