సుప్రీమ్‌లో మెగా హీరో గెస్ట్‌రోల్‌

Allu Sirish guest appearance in Supreme

12:08 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Allu Sirish guest appearance in Supreme

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌తేజ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్‌'. 'పటాస్‌' ఫేమ్‌ అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్‌ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో పటాస్‌ హీరోయిన్‌ శృతి సోథి ఐటమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఇందులో మరో విశేషమేమిటంటే మెగా హీరో అల్లు శిరీష్‌ గెస్ట్‌ అపీయరెన్స్ ఇవ్వబోతున్నాడట. అవును ఇది అక్షరాలా నిజం మెగా హీరో అల్లు శిరీష్‌ ఈ చిత్రం క్లైమ్యాక్స్ లో అదిరిపోయే ఎంట్రెన్స్‌ ఇవ్వబోతున్నాడట. ఈ సన్నివేశం సాయి ధరమ్‌-అల్లు శిరీష్‌ మధ్య వస్తుందట. ఇప్పటికే రిలీజైన సుప్రీమ్‌ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఎంత హైప్‌ని క్రియేట్‌ చేసాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

English summary

Mega hero Allu Sirish guest appearance in Supreme hero Sai Dharam Tej's Supreme movie. This movie is directing bu Anil Ravipudi. Rashi Khanna is romancing with Sai Dharam in this movie.