ఆ సినిమా అల్లు శిరీష్ చేసుంటే ఎక్కడికో వెళ్లిపోదును.. కానీ..

Allu Sirish missed Pelli Chupulu movie

03:05 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Allu Sirish missed Pelli Chupulu movie

ఇప్పుడు సినిమాల్లో ఇంచుమించు అందరూ సినీ నేపధ్యం దండిగా ఉన్నవాళ్లే వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోస్ వచ్చేసారు. అందులో అల్లు శిరీష్ ఒకడు. మెగా స్టార్ చిరంజీవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అల్లుడుగా, అల్లు అర్జున్ కి తమ్ముడిగా, అల్లు అరవింద్ కి చిన్న కొడుకుగా 'గౌరవం' సినిమాతో టాలీవుడ్ లో మెగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. అల్లు శిరీష్ కెరీర్ లో ఇప్పటి వరకు అంత పెద్ద హిట్స్ ఏమి రాలేదు. ఇక అల్లు అరవింద్ కూడా అల్లు శిరీష్ కెరీర్ ని దారిలో పెట్టడానికి మొదటి నుండి కూడా హిట్ డైరెక్టర్స్ ని పట్టుకొని మరి మూవీస్ డైరెక్టర్ చేయించినా ఏ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు.

ఇటివల రిలీజ్ అయ్యిన 'శ్రీరస్తు శుభమస్తు' మూవీ మాత్రం కొంచెం పరవాలేదని అనిపించుకొని మంచి ఫ్యామిలీ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ, తమ హీరో మంచి సినిమా మిస్సయ్యాడని మెగా అభిమానులు తెగ బాధపడిపోతున్నారట. ఆ సినిమా ఏంటంటే, 'పెళ్లి చూపులు' మూవీ. విజయ్ హీరోగా ఈ సినిమాను నిర్మించిన దర్శకనిర్మాతలు ఈ సినిమా విడుదల కోసం అల్లు అరవింద్ ను సంప్రదించారట. అయితే, అరవింద్ కు సినిమా బాగా నచ్చడంతో, ఈ సినిమా రిలీజ్ ఆపేసి, శిరీష్ హీరోగా మళ్లీ తీద్దామని సూచించాడట. అంతేకాదు, దీనికోసం అల్లు పెద్దమొత్తమే ఆఫర్ చేశాడట.

అయితే, మళ్లీ సినిమా ఎక్కడ తీస్తామని భావించిన దర్శకనిర్మాతలు సురేశ్ బాబును సంప్రదించడం సినిమా రిలీజ్ అయిపోవడం పెద్ద విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఈ సినిమా అల్లు శిరీష్ హీరోగా తీసి ఉంటే, తన కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయేదని అభిమానులు తెగ ఫీలయిపోతున్నారట. దేనికైనా రాసి పెట్టి వుండాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: వాసెలిన్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసా?

ఇది కూడా చదవండి: టీచర్ చెంప చెల్లుమనిపించాడు.. ఆపై...

ఇది కూడా చదవండి: ఈ సినిమాను నా మనవళ్లను కూడా చూడమంటా!

English summary

Allu Sirish missed Pelli Chupulu movie.