అల్లు శిరీష్ కోరిక తీర్చిన తమన్నా!

Allu Sirish shared a screen with Tamanna

03:50 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Allu Sirish shared a screen with Tamanna

ఏంటి కోరిక తీర్చుకున్నాడు అంటే వేరే ఎదో అనుకుంటున్నారా? అలా అనుకుంటే తప్పులో కాల్సినట్లే.. అసలేం కోరిక తీర్చుకున్నాడో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. మెగా కాంపౌండ్ లో నుంచి వచ్చిన చాలా మంది హీరోస్ లో అల్లు శిరీష్ ఒక్కడు. మెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అల్లుడుగా, అల్లు అర్జున్ కి తమ్ముడిగా అల్లు అరవింద్ కి చిన్న కొడుకుగా టాలీవుడ్ లోకి 'గౌరవం' సినిమాతో మెగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అల్లు శిరీష్ కెరీర్ లో ఇప్పటి వరకు అంత పెద్ద హిట్స్ ఏమీ రాలేదు. అల్లు అరవింద్ కూడా అల్లు శిరీష్ కెరీర్ ని దారిలో పెట్టడానికి మొదటి నుండి కూడా హిట్ డైరెక్టర్ ను పట్టుకొని మరి మూవీస్ డైరెక్టర్ చేయించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేకపోయింది.

కాగా ఇటీవల రిలీజ్ అయిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం మాత్రం కొంచెం ఫర్వాలేదు అని అనిపించుకొని మంచి ఫ్యామిలీ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఈ హీరో ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో కలసి తెరని పంచుకొన్నాడు. అలాగని సినిమాలో కాదండోయ్... ఓ బ్రాండ్ లో తమ్మూతో కలసి శిరీష్ నటించాడు. ప్రస్తుతం టీవీల్లో వస్తున్న ఓ యాడ్ లో వీరిద్దరూ జంటగా నటించారు. ఓ షాంపూ ప్రకటనకు చెందిన తెలుగు వెర్షన్ లో శిరీష్ - తమన్నా కాంబో కనిపించింది. ఇది చూసిన జనాలు.. అబ్బో శిరీష్ మామూలోడు కాదు. ఏకంగా తమ్మూతోనే కానిచ్చేస్తునాడని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

English summary

Allu Sirish shared a screen with Tamanna