డీజే సరసనకాజల్ - 'మెగా' దగ్గర రాయబారం ...

Alluarjun upcoming movie Dj heroin Kajal

10:59 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Alluarjun upcoming movie Dj heroin Kajal

సరైనోడు తర్వాత అల్లుఅర్జున్ న్యూఫిల్మ్ దువ్వాడ జగన్నాథం (డీజే) కన్ఫర్మ్ కావడం, వెంటనే షూటింగ్ కి క్లాప్ కొట్టడం జరిగిపోయాయి. ఇక ఈ ఫిల్మ్ ప్రారంభానికి ముందే ఖైదీ నెం150 మూవీ సెట్స్‌కి డైరెక్టర్ హరీష్‌శంకర్, ప్రొడ్యూసర్ దిల్‌రాజు వచ్చారు. మరి సందర్భం ఏంటోగానీ కాసేపు చిరు, వీవీ వినాయక్, కాజల్‌తో ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ దిల్‌రాజు అండ్ కో చిరంజీవి ఆశీర్వాదం కోసమే అక్కడికి వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మూవీ ప్రారంభానికి ముందు గతంలో ఎప్పుడూ చిరు వద్దకు దిల్‌రాజు టీం రాలేదు. ఈసారి ఎందుకు వచ్చినట్టు అంటూ చర్చించు కోవడం అందరి వంతు అయింది. డీజేలో హీరోయిన్గా కాజల్‌ని తీసుకున్నారంటూ ఓ వైపు ఫిల్మ్‌నగర్‌లో చర్చ. గతంలో అల్లుఅర్జున్ -కాజల్ జంటగా ‘ఎవడు’లో కనిపించారు. ఆ సినిమాకి నిర్మాత దిల్‌రాజు కాగా, బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి తెరపై కనిపించిన సందర్భం రాలేదు. అందుకే డీజేలో కాజల్‌కి ఆఫర్ ఇచ్చారని అందుకోసమే అక్కడికి వచ్చినట్టు ఇన్సైడ్ సమాచారం. మొత్తానికి ‘ఎవడు’ సెంటిమెంట్ దిల్‌రాజుని బానే వెంటాడుతున్నట్లు కనిపిస్తోందన్నమాట.

ఇది కూడా చూడండి: కలల వెనుక ఎన్నో అంతుచిక్కని రహస్యాలు!

ఇది కూడా చూడండి: మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకండి.. ఎందుకంటే..

English summary

Allu Arjun Duvvada Jagannatham movie Producer Dil Raju And Director Harish In chiranjeevi Khaidi No150 movie Set.