భరణం వద్దంటూ పిటిషన్ ...

Amala Paul Does not Want Alimony

11:31 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Amala Paul Does not Want Alimony

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎన్నో జంటలు పెళ్లి చేసుకోవడం, విడిపోవడం సహజంగా మారుతూ వస్తోంది. తాజాగా అమలాపాల్-ఎ.ఎల్.విజయ్ జంట చూడముచ్చటగా కనిపించినా, పెళ్లయిన రెండేళ్లకే విడిపోవడం బాధాకరమైన విషయంగా సినీ లవర్స్ అంటున్నారు. ఇక వీరి బంధం అధికారికంగానే తెగిపోనుందని తేలిపోయింది. ఇద్దరూ కలిసి పరస్పర అంగీకారంతో విడాకులకు కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేసేశారు. మ్యూచువల్ కన్సెంట్ తో వేసిన పిటిషనే కాబట్టి విడాకులు మంజూరు కావడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. ఐతే ఈ విడాకుల విషయంలో మరో ట్విస్టు ఉంది.

మామూలుగా సెలబ్రెటీలు విడాకులు పొందినపుడు, భార్య భారీ స్థాయిలో భరణం (మనోవర్తి) డిమాండ్ చేయడం.. అందుకు అంగీకరించాకే విడాకులు పొందడం సహజం. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి ఎన్నో కేసులు ఇప్పటిదాకా జరిగాయి. ఐతే అమలా పాల్ మాత్రం తనకు భరణం ఏమీ వద్దని అంటోంది. పైగా విడాకుల పిటిషన్లో ఈ విషయం కూడా స్పష్టం చేయడం విశేషం. అమలకు అత్తింటి వేధింపులని.. సినిమాల్లో నటించకుండా ఆపుతున్నారని రకరకాల వార్తలొచ్చాయి.

ఇక ఈ నేపథ్యంలో విడాకుల విషయంలో జనాల సింపతీ అంతా అమల వైపే ఉంది. ఇప్పుడిక భరణం కూడా వద్దనడంతో ఆమె వైపు వెయిట్ అమాంతం పెరిగిపోయింది. అమలాకు హీరోయిన్ గా ఇప్పటికీ తమిళ మలయాళ భాషల్లో మంచి డిమాండే ఉంది. హీరోయిన్ గా బాగా సంపాదించుకోవడానికి ఛాన్సుంది. అందుకే ముందు ఈ బంధం నుంచి బయటపడితే చాలని అమలా భావిస్తున్నట్లుంది. అందుకే భరణం వద్దనే అంశాన్ని స్పష్టంగా పేర్కొంది.

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఇది కూడా చూడండి: మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

English summary

Amala paul says " i don't want Alimony".