భర్త రెచ్చిపొమ్మన్నాడు... ఇక అందాలు ఆరబోస్తా...

Amala Paul ready to do skin show

09:40 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Amala Paul ready to do skin show

పెళ్ల‌య్యాక చాలా మంది హీరోయిన్లు సినీ రంగానికి దూరమైపోతుంటారు. ఒక‌వేళ నటించాలని అనిపించినా సెకండ్ ఇన్నింగ్స్‌లో అమ్మ పాత్ర లో, నడి వయస్సు ఆంటీ పాత్రలో వేస్తూ ఒందిగ్గా, పొందిగా ఒదిగిపోతారు. ఎందుకంటే పెళ్ల‌య్యాక గ్లామ‌ర్ త‌గ్గ‌డం సర్వసాధారణం. దీంతో వాళ్ల‌కు డీ గ్లామ‌ర్ పాత్ర‌లే వస్తుంటాయి. అయితే అమ‌లాపాల్ మాత్రం.. తనకి గ్లామ‌ర్ పాత్ర‌లే కావాలంటోంద‌ట‌. అంతే కాదు.. పాత్ర ఎంత ఘాటుగా ఉన్నా ఫ‌ర్వాలేదని అంటోందట‌. హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని నేను ఈ రంగంలోకి రాలేదు అని అమలాపాల్ చెప్పేస్తోంది. 'నాకు నటన అంటే ఇష్టం, విభిన్నపాత్రలు పోషించాలని ఉంది. నటిగా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఉంది.

అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను తప్ప స్టార్ అవ్వాలని మాత్రం కాదు. మంచి పాత్రలు రావాలంటే ముందు గుర్తింపు తెచ్చుకోవాలి. అందుకే గ్లామర్ పాత్రలు కూడా ఒప్పుకోవాల్సి వస్తోంది' అంటోంది. ఇంతకీ ఈ మలయాళీ భామకు తన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు అయిన ఏ.ఎల్ విజయ్‌తో పెళ్లి అయింది. ఇప్ప‌టివ‌ర‌కూ కెరీర్‌లో చాలా వరకు డీ గ్లామ‌ర్ పాత్ర‌లే పోషించిందట. ఎప్పుడూ అలాంటి పాత్రలే చేయాలంటే బోర్‌ అంటోంది ఈ అమ్మడు. మ‌రి పెళ్ల‌యింది క‌దా అని అడిగితే.. 'మా వారు విజ‌య్ కూడా సినిమా రంగ‌మే కావ‌డం నా అదృష్టం. ఇక్క‌డి ప‌రిస్థితులు ఆయ‌న‌కు బాగా తెలుసు.

న‌న్ను ఈ విష‌యంలో స‌పోర్ట్ చేస్తార‌ని నా న‌మ్మ‌కం' అని చెబుతోంది ఈ అమ్మడు. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి అమ‌లాపాల్ సై అంటోంది మరి చూసేదెవరా అని జనాలు గుసగుసలు ఆడుకుంటున్నారు.

English summary

Amala Paul ready to do skin show. Amala Paul husband told to her that you can do skin show how much you can.