చెన్నై తరహాలో అమరావతికీ ముప్పు 

Amaravathi To Become Another Chennai

12:37 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Amaravathi To Become Another Chennai

వరదలకు, వానలకు చెన్నై మహానగరం అతలాకుతలం కాగా, ఇదే తరహా ముప్పు ఎపి. నూతన రాజధాని అమరావతికి కూడా ఉందా? అవునంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభసభ్యలు డాక్టర్‌ కెవిపి రామచంద్రరావు. ఇదే విషయన్ని కేంద్రం దృష్టికి తెస్తూ లేఖ రాసారు. ఎంత పగడ్భందీగా, ప్రణాళికా బద్ధంగా రాజధాని నిర్మించినప్పటికీ ముప్పు తప్పదని అయన చెబుతున్నారు. ఇందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మించడం వలన కొందరకి జరిగే ప్రయోజనాల తాను మాట్లాడడం లేదని ఆయన స్పష్టంచేసారు. ఈ రాజ్యసభలో ప్రసావించాలని అనుకొన్నప్పటికీ కుదరలేదన్నారు. ఇప్పటికే భూసమీకరణ, భూసేకరణ విషయాలలో వివాదం రేగడం తెలిసిందే. ఇప్పుడు రాజధానికి వరద ముప్పు ఉందన్న వాదన తెరమీదకి వచ్చింది.


English summary

Congress senior leader KVP.Ramachandra rao says that andhra pradesh new capital amaravathi to become flodded chennai . He says that he has certain evidences to prove that