మహిళా కలెక్టర్ కాంగ్రెస్ ఎం ఎల్ ఎ ఎంత మాటన్నాడు?

Amarjeet Bhagat shocking comments on collector

11:46 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Amarjeet Bhagat shocking comments on collector

ప్రజాప్రతినిధులు చాలా బాధ్యతగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా నేతల బరి తెగింపు యవ్వారాలు ఈ మధ్యన ఎక్కువైపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాయ్ పూర్ లో చోటు చేసుకుంది. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్జిత్ భగత్ కు సహజంగా నోటి దురద కాస్త ఎక్కువ. ముందు వెనుకా చూడకుండా ఫైర్ అయ్యే ఇతగాడి నోటికి.. సర్ గుజ (అంబికాపూర్) జిల్లా కలెక్టర్ రితూసేన్ బలయ్యారు.


ఆ మహిళా కలెక్టర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్నే రేపాయి. హీరోయిన్ మాదిరి అందంగా ఉన్నావంటూ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే అనడమే కాదు, మరో పుల్ల విరుపు మాట ఎం ఎల్ ఎ నోట వచ్చేసింది. "అందంగా వున్నావ్ కానీ పని చేయటం మాత్రం రాదే" అంటూ ఎం ఎల్ ఎ మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


మహిళా కలెక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఎపిసోడ్ పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటంతో ఎమ్మెల్యే అమర్ జిత్ భగత్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కుడా చుడండి :ఒకే కాన్పులో నలుగురు

ఇది కుడా చుడండి :యంగ్ టైగర్ - ఇలయదళపతి కలిశారు..

ఇది కుడా చుడండి :మోసం చేసిందని ప్రియురాలిని వెంటాడి చంపేశాడు

English summary

Amarjeet Bhagat shocking comments on collector.