వావ్ .. అంతరిక్షంలో దిబ్బరొట్టె..

Amazing Footage Of A Pie In Space

11:49 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Amazing Footage Of A Pie In Space

పూర్వం అందరి ఇళ్లల్లో దిబ్బరొట్టె దర్శనం ఇచ్చేది. రానురాను చాలా ఇళ్లల్లో కనుమరుగైంది. ఎక్కడో గానీ దిబ్బరొట్టె గురించి వినపడడం లేదు. ఈమధ్య కాలంలో చాలామందికి దీని రుచి కూడా తెలీదు. అయితే భూమ్మీద మాయమవుతున్న దిబ్బరొట్టె అంతరిక్షంలో ప్రత్యక్షం అయిందట. అవును, మాంసం- బంగాళదుంపలతో తయారుచేసిన రుచికరమైన ‘పై’(దిబ్బరొట్టె) మొదటి సారి అంతరిక్షంలోకి వెళ్లింది. అది ఎలా అంటే,స్పేస్ గ్రీక్స్ బృందానికి చెందిన టోనీ కల్లాఘాన్ గ్రేటర్ మాంచెస్టర్ లోని వీగన్ లోని ఫాక్స్ పబ్ నుంచి ఈ ‘పై’ని ఫాయిల్ లో ప్యాక్ చేసి వెధర్ బెలూన్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. బెలూన్ కు కెమెరా అమర్చారు. వచ్చే వారం జరగనున్న ‘వరల్డ్ పై ఈటింగ్ ఛాంపియన్ షిప్ ’ను ప్రామోషన్ లో భాగంగా ఈ ప్రయోగం చేశారు. ‘‘మేము అంతరిక్షంలోకి పైని పంపుతున్నామని తెలియగానే ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పై’ని అంతరిక్షంలోకి పంపడం చాలా అద్భుతంగా ఉంది. ’’ అని టోనీ అంటున్నారు. దీని ఫలితం ఏమిటో త్వరలోనే తేలనుంది.

ఇది కూడా చూడండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

ఇది కూడా చూడండి: బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

English summary

Amazing Footage Of A Pie In Space. Wigan space mission proves to be pie in the sky and orbiting the Earth.