ఇయర్ ఎండింగ్ లో హాట్ హాట్ ఆఫర్లు

Amazing Year Ending Offers

04:00 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Amazing Year Ending Offers

2015 చివరికి వచ్చేసింది. మరో పది రోజులు ఆగితే 2016 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ వెబ్ సైట్లు హాట్ హాట్ ఆఫర్లను ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్టాప్ డీల్, పేటీఎం తదితర ఈ-కామర్స్ సైట్లు కొనుగోలుదారులకు భారీ రాయితీలు, తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ ధరలను అందిస్తున్నాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గేమింగ్ కన్సోల్స్‌తోపాటు ఇతర ఉత్పత్తులపై పలు రకాల డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇయర్ ఎండింగ్ సేల్‌లో భాగంగా ఆయా సంస్థలు ఈ అమ్మకాలను చేపట్టాయి. లెనోవో కె3 నోట్, షియోమీ ఎంఐ 4ఐ, మోటో జి 3వ జెన్, అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5, ఆన్7, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ 4జీ, నికాన్ డి3200, మైక్రోమ్యాక్స్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ, విండోస్ ల్యాప్‌టాప్‌లు తదితర ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ రాయితీలను అందిస్తోంది. స్నాప్ డీల్ తన వినియోగదారులకు రూ.500 కొనుగోలు చేస్తే రూ. 100 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అదేవిధంగా పేటీఎం తన వాలెట్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఎల్‌ఈడీ టీవీలు, హెడ్‌ఫోన్స్, కెమెరాలు, మొబైల్స్, ల్యాప్ టాప్స్ వంటి వాటిపై భారీగా ఆఫర్లను అందజేస్తోంది. అమెజాన్ కూడా ఇలాంటి ఆఫర్లనే ప్రకటించింది.

English summary

Various E-commerce sites like Flipkart, Amazon, Snapdeal, Paytm are offering deals on popular mobiles, electronics, gaming consoles and other items in their respective year-end sales