కార్గో రంగంలోకి అమెజాన్‌ 

Amazon Air Cargo

04:30 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Amazon Air Cargo

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ ఎయిర్ కార్గో రంగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. విమానాల ద్వారా సరుకుల్ని రవాణా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెల నుంచి సొంత ఎయిర్‌ డెలివరీ సర్వీసుని ప్రారంభిస్తున్న ఈ సంస్థ అందుకోసం పలు సంస్థలతో విమానాల లీజ్‌ విషయమై చర్చలు జరుపుతోంది.

తాజాగా బోయింగ్‌ కో 767కు చెందిన 20 విమానాల్ని లీజ్‌కి తీసుకునేందుకు బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టింగ్‌ సంస్థలైన ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌ గ్రూప్‌(ఏటీఎస్‌జీ), అట్లాస్‌ ఎయిర్‌, కలిట్టా ఎయిర్‌ సంస్థలతో కూడా మంతనాలు జరిపిందని సీటెల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఎయిర్‌ డెలివరీ సర్వీసు కోసం ఏటీఎస్‌జీ సంస్థ నిర్వహణలోని కార్గో విమానం ద్వారా అమెరికాలోని విల్మింగ్‌టన్‌ నుంచి వచ్చే జనవరిలో ట్రైల్‌ రన్‌ నిర్వహించనుందని తెలిపింది.

English summary

Famous E-commerce shopping site Amazon to launch its new cargo business named Amazon Air Cargo