ఫ్లిప్‌కార్ట్ కు అమెజాన్ ఉద్యోగి టోకరా

Amazon Employee Arrested For Cheating Flipkart

04:48 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Amazon Employee Arrested For Cheating Flipkart

ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను మోసగించిన ఇద్దరు టెక్కికల్‌ ఉద్యోగులను హైదరాబాద్‌ లో చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు అయిన వారిలో ఒకరు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఉద్యోగి కాగా మరొకరు టెక్‌మహీంద్రకు చెందిన ఉద్యోగి కావడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే వీరిద్దరూ కలసి ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 6 ఫోన్‌ను ఆర్డర్‌ చేసారు. ఆ ఫోన్‌ కు ఆన్‌లైన్‌లోనే 51,000 లను కుడా చెల్లించారు కుడా . అయితే వీరు ఆర్డరు పెట్టిన ఫోన్‌ వారికి డెలివరీ అయినప్పటికీ ఆ పార్సెల్‌లో ఫోను లేదని అందులో రబ్బరు, తెల్ల కాగితాలు ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్‌ వారికి కంప్లెట్‌ పెట్టారు. దీంతో స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ వారికి చెల్లించిన 51,000 రూపాయలను వెనక్కి తిరిగి ఇచ్చేసారు. దీని పై విచారణ చేపట్టిన ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఆ ఐఫోన్‌6 ను హైదరాబాద్‌ లో ఉపయోగిస్తున్నట్లు IMEI నెంబరు ద్వారా తెలుసుకున్నారు.

దీంతో చిక్కడపల్లి పోలీసులకు ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ వారు ఫిర్యాదు చెయ్యగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్‌ IMEI నెంబరు సహాయంతో ఆ ఫోన్‌ వాడుతున్న వారిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

English summary

Men from Amazon who have cheated Flipkart arrested Yesterday in Hyderabad.