అమెరికన్లకు రోతపుట్టిస్తున్న అమెజాన్‌ 

Amazon Frastuates American People

11:34 AM ON 24th November, 2015 By Mirchi Vilas

Amazon Frastuates American People

ఏంటి అమెరికాలోనే కాక, ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఇకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎందుకు అమెరికన్లను ఇబ్బంది పెడుతుందనే కదా మీ అనుమానం. అవును అమెజాన్‌ చేసిన ఒక వ్యాపార ఎత్తుగడ కాస్తా బెడిసికొట్టి అమెరికన్లకు రోత కలిగేలా చేసింది. అమెజాన్‌ మ్యాన్‌ ఇన్‌ ది హై కాజిల్‌ అనే ఒక చారిత్రక నేపథ్యం కల టీవి సిరీస్‌ను ప్రమోట్‌ చేస్తోంది. హిట్లర్‌ కనుక రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికాపై నెగ్గితే హిట్లర్‌ పాలనలో అమెరికా ఎలా ఉండబోతుందోనన్న కథాంశంపై సాగుతోంది ఆ టీవీ సీరియల్‌. ఈ టీవీ సీరియల్‌లో ప్రచార బాధ్యతలను తలనెత్తుకున్న అమెజాన్‌ వినూత్నంగా హిట్లర్‌ నాజీ పార్టీ చిహ్నం స్వస్తిక్‌ను, జపాన్‌ రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన ఉదయించే సూర్యుడిని తమ పబ్లిసిటీ డిజైన్స్‌లో పొందుపరిచింది.

అలాగే స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, న్యూయార్క్‌ సిటీ మొత్తం నాజీ చిహ్నాలతో నిండిపోయినట్లు డిజైన్‌ చేసిన పోస్టర్లు ఇప్పుడు అమెరికా మొత్తం ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్లు ఎక్కువగా జనం గుమిగూడే ప్రదేశాలలో, పబ్లిక్‌ ట్రైన్లలో, టాయ్‌లెట్‌లలో ఉండడంతో ఎక్కువ మంది అమెరికన్లు వీటిని చూడడానికి ఇబ్బంది పడుతున్నారట. హిట్లర్‌ అన్నా, జపాన్‌ అన్నా ఏమాత్రం ఇష్టం పడని సగటు అమెరికన్‌ మానసిక స్థితికి వ్యతిరేకంగా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్న ఈ పబ్లిసిటీ పట్ల సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా సెటైర్లు వేస్తున్నారు అమెరికన్లు.

నిజానికి ప్రజలను అమితంగా ఆకర్షించే ఉద్దేశ్యం విషయంలో విమర్శలు మూటగట్టుకున్నా చివరికి విజయం సాధించినట్టే కదా.

English summary

Worlds Most Popular E-commerce Site Amazon Frastuates American People with the promotion of the program "Man In THe High Castle" by putting ,posters of Nazi's symbols etc