వ్యాపారుల కోసం అమెజాన్‌ తత్కాల్‌

Amazon launches Tatkal Services

03:30 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Amazon launches Tatkal Services

ప్రముఖ అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కొత్త సేవలను ఆరంభిస్తోంది. అమెజాన్‌ తత్కాల్‌ పేరుతో అందిస్తున్న ఈ పథకంతో చిన్న, మధ్యతరహా వ్యాపారస్థులు ఆన్‌లైన్‌ ద్వారా అమెజాన్‌లో తమ ఉత్పత్తులను అమ్మవచ్చు. అమెజాన్‌ తత్కాల్‌ను మొదట ఢిల్లీలో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత దీనిని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. అమెజాన్‌ తత్కాల్‌ ద్వారా వేలాది మంది వ్యాపారస్థులు, ఉత్పత్తిదారులు, అమ్మకందారులకు సహాయపడనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. అమెజాన్‌ తత్కాల్‌ ప్రత్యేకంగా తయారుచేసిన స్టూడియో ఆన్‌ వీల్స్‌. దీని ద్వారా కంపెనీ స్వయంగా చిన్న వ్యాపారస్థుల దగ్గరికి వెళ్తుందని పేర్కొంది.

English summary

Worlds Popular online E-commerce website Amazon launches a new scheme called Amazon Tatkal.With this new service small and medium businesses to go online and sell products on Amazon Website