రెండు గంటల్లో అమేజాన్‌ నౌ డెలీవరీ

Amazon Now Delivery In Just Two Hours

09:26 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Amazon Now Delivery In Just Two Hours

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ సరికొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. అమేజాన్‌ నౌ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే నిత్యావసర సరుకులు, తదితర వస్తువులను రెండు గంటల్లోనే డెలివరీ చేయనుంది. తాజాగా ఈ సర్వీసును కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రవేశపెట్టింది. కేవలం యాప్‌ ద్వారా అందుబాటులో ఉండే ఈ సర్వీసు కింద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సరుకులు డెలివరీ చేస్తారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ డివైజెస్‌లో యాప్‌ను గూగుల్‌ప్లే ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సర్వీసుకు ముందుగా వినియోగదారులు తమ పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా రెండు గంటల్లో డెలివరీ చేసే సర్వీసు అందుబాటులో ఉందో లేదో అమేజాన్‌ వెల్లడిస్తుంది. బెంగళూరులోని 70 పిన్‌కోడ్‌ ప్రాంతాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉంది. అమేజాన్‌ వినియోగదారులకు రెండు గంటల్లో డెలివరీ ఇచ్చేందుకు బిగ్‌బజార్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌, ఫుడ్‌వరల్డ్‌ తదితర మార్కెట్లతో అనుసంధానమైంది.

English summary

Amazon India has launched its Amazon Now app and service, which provides two-hour delivery in Bengaluru for essential household items. Customers can also opt for any two-hour scheduled delivery time slot of their choice on the app between 10am and 10pm.