అమెజాన్ స్పెషల్ గిఫ్ట్ కార్డ్ ఆఫర్

Amazon Offers Gift Cards To Its Customers

05:08 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Amazon Offers  Gift Cards To Its Customers

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ తన వినియోగదారులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. తమ సైట్‌లో షాపింగ్ చేసే వారి కోసం గిఫ్ట్ కార్డ్ ఆఫర్ ను ఇస్తోంది. సోమవారం అమెజాన్ సైట్‌లో రూ.500 అంతకు పైన ఏ వస్తువును కొనుగోలు చేసినా రూ.200 గిఫ్ట్ కూపన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ కూపన్ జనవరి 20లోగా వినియోగదారులకు అందనుంది. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోళ్లు జరిపే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో తమ సంస్థను వినియోగదారులు ఎక్కువగా ఆదరిస్తున్నారని, ఈ ఏడాది అక్టోబర్ సీజన్‌లో తమ సైట్ ద్వారానే వినియోగదారులు కొనుగోళ్లను ఎక్కువగా జరిపారని ఆయన తెలిపారు. ప్రారంభించి రెండున్నరేళ్లు మాత్రమే అయినప్పటికీ అమెజాన్‌ను భారత్‌లోని వినియోదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, వారి కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ కూపన్‌లను అందిస్తున్నట్టు తెలిపారు.

English summary

Online Shopping Site Amzon Offers Gift Cards To Its Customers. Amazon Offers Rs. 200 Gift Card on Orders Worth Rs. 500 and Above