చెప్పుల పై మహాత్మాగాంధీ బొమ్మలు : అమెజాన్ దురహంకారం

Amazon Sells Flip Flops With Mahatma Gandhi Image

12:03 PM ON 17th January, 2017 By Mirchi Vilas

Amazon Sells Flip Flops With Mahatma Gandhi Image

భారత్ లో వ్యాపారం కావాలి. కానీ, మన జాతీయ పతాకాన్ని, నేతలను, దేవుళ్లను అవమానించేలా అహంకారంతో కొన్ని సంస్థలు వ్యవహరించడం మానలేదు. గతంలో భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్లను అమ్మకానికి పెట్టి తీవ్ర విమర్శల పాలైన అమెజాన్ సంస్థ , తాజాగా అదే తరహాలో తన దురహంకారాన్ని ప్రదర్శించింది. జాతీయ పతాకంతో ఉన్న డోర్ మ్యాట్లను తొలగించిన రెండు రోజుల అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మతో ఉన్న చెప్పులను తన అమ్మకాల జాబితాలో పెట్టింది. అమెజాన్ .కామ్ వెబ్ సైట్ లో ‘గాంధీ ఫ్లిప్ ఫ్లాప్స్ ’ పేరిట వీటిని 16.99 డాలర్లకు అమ్మకానికి ఉంచింది. మహాత్ముని ఫొటోను ఇలా చెప్పులపై ముద్రించి మరోసారి భారత్ ను అవమానపరించింది. ఈ ఘటనపై పలువురు అమెజాన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇటీవల భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్లను అమ్మకానికి పెట్టడంపై పలువర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ ఘటనపై మండిపడ్డారు. వెంటనే వాటిని తొలగించి క్షమాపణ చెప్పాలని లేకపోతే అమెజాన్ అధికారులెవ్వరికీ భారత వీసా లభించదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దీంతో వాటిని ఉపసంహరించుకుంది అమెజాన్ సంస్థ. ఇప్పుడు ఏకంగా మహాత్మాగాంధీ బొమ్మనే చెప్పులపై ముద్రించడం మరింత వివాదానికి దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి: త్రిషను కూడా చంపేసిన సోషల్ మీడియా!

ఇవి కూడా చదవండి: ప్రియుడి కోసం ఆమె ఓ సాహసం చేసింది .. తీరా ఏమైందంటే

English summary

World's Popular E-Commerce website was recently kept Indian Flag printed Door mats in its website and amazon was warned by Indian Foreign Affairs Minister Sushma Swaraj also. Now Amazon kept Flip Flops with the image of Mahatma Gandhi and some were fired by posting these pics in Social Media.