ట్రైలర్‌ ఏడు గంటలు - సినిమా 30రొజులు

Ambiance Movie Trailer With 7 hours And 30 Days of Movie Length

11:58 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Ambiance Movie Trailer With 7 hours And 30 Days of Movie Length

ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? నిజం ... సాధారణంగా సినిమా ట్రైలర్‌ మహా అయితే 2 నుంచి 4 నిమిషాలు ఉంటుంది. అయితే స్వీడిష్‌ డైరెక్టర్‌ ఆండ్రూస్‌ వెబెర్గ్‌ అనే దర్శకుడు తీస్తున్న సినిమా ట్రైలర్‌ దాదాపు ఏడు గంటలు అంటే 439 నిమిషాలు ఉంది. ట్రైలరే ఇంతుంటే సినిమా ఇంకెంత ఉంటుందో అన్న అనుమానం రావడం సహజం..అయితే మీ అనుమానం కరెక్టే ఆ సినిమా పూర్తి నిడివి 30 రోజులు అట. గతేడాదే 72 నిమిషాల చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇంతకీ ఆ సినిమా పేరు ఎమిటో తెలుసా? ‘ఆంబియన్స్‌’.

ఇవి కూడా చదవండి :విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

ప్రపంచంలోనే అత్యంత నిడివి గల సినిమాగా గిన్నీస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న ఈ సినిమాను ఆండ్రూస్‌ గత 20 ఏళ్లుగా రూపొందిస్తున్నాడు. కాలం, అంతరిక్షం సబ్జెక్టులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 2020, డిసెంబర్‌ 31న విడుదల కానుంది. ముప్పై రోజుల సినిమా ఎన్ని భాగాలుగా వుంటుందో మరి.

ఇవి కూడా చదవండి :

సంగీతానికి థమన్ గుడ్ బై!

మ్యకృష్ణతో గొడవ పెట్టుకున్న నారా రోహిత్!

English summary

A Director named Anders Weberg was making a Film Named "Ambiance" and recently this movie trailer was released and the total time of that Trailer was 7 hours. The length of this movie was 30 days.