ప్రాణం తీసిన సీఎం కాన్వాయ్

Ambulance stopped to allow Karnataka CM Convoy

02:42 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Ambulance stopped to allow Karnataka CM Convoy

ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు .. కొందరు వార్తల్లోకి ఎక్కితే, మరికొందరు వార్తగా మారతారు .. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం కాన్వాయ్ వెళ్లడం కోసం.. అంబులెన్స్ ను సైతం అడ్డుకోవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో.. సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకి ఎక్కారు. జూన్ 25న హోస్కొటే సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ వెళ్లడం కోసం.. చిక్కబల్లాపూర్ -చింతామణి హైవేపై ట్రాఫిక్ ను దాదాపు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ లో ఓ అంబులెన్స్ కూడా ఉంది. తన తల్లి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని.. అంబులెన్స్ కు దారి ఇవ్వాలని ఓ వ్యక్తి పోలీసులను కోరాడు. మిగతా వాహనదారులు కూడా అంబులెన్స్ ను వెళ్లనివ్వాలన్నారు. అయితే పోలీసులు మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా.. కాన్వాయ్ వెళ్లిన తర్వాతే ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

దాంతో అంబులెన్స్ ఆసుపత్రికి చేరేసరికి ఆలస్యమవ్వడంతో అప్పటికే అందులోని మహిళ మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటననంతా ఓ వ్యక్తి వీడియోతో పాటు.. ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను అడ్డుకున్న మాట నిజమే గానీ.. కేవలం 2-3 నిమిషాలే ట్రాఫిక్ ను నిలిపివేశామన్నారు. పైగా.. అంబులెన్స్ లో ఉన్న మహిళ పరిస్థితి కూడా అప్పుడు మెరుగ్గానే ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు , ప్రముఖులకు కునుకు ఉండడం లేదు.

ఇది కూడా చూడండి: దోమ కాటుకి సమర్ధవంతమైన చిట్కాలు

ఇది కూడా చూడండి: ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా?

ఇది కూడా చూడండి: పాములు నిజంగా పగ పడతాయా?

English summary

Ambulance stopped to allow Karnataka CM Convoy. CM Convoy blamed for woman's death in Hoskote.