400 శాతం పెరగనున్న హెచ్‌-2బీ వీసాలు

America decided to increase quota of H-2B visa

03:54 PM ON 19th December, 2015 By Mirchi Vilas

America decided to increase quota of H-2B visa

హెచ్‌-2బీ వీసా కోటాని 400 శాతం మేర పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పనివారిని అమెరికాకి తెచ్చుకునేందుకు ఈ హెచ్-2బీ వీసా ఉపయోగపడుతుంది. గతంలో ఏటా 66,000 మందికి ఈ వీసాలు జారీ చేసేవారు. ఇప్పుడా సంఖ్య 2,50,000కు పెరగనుంది. సంవత్సరాంతపు ఫండింగ్‌ బిల్‌లో ఈ ప్రతిపాదన చేర్చినట్లు సమాచారం. అయితే ఈ పెంపు ప్రభావం భారతీయులపై అంతగా పడదు. ఇలాంటి వీసాపై అమెరికా వెళ్లేందుకు భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపించరు. ఈ విషయమై సెనేటర్‌ జెఫ్‌ సెషన్స్‌ మాట్లాడుతూ... ఈ నిర్ణయంతో ఫెడరల్‌ ఇమిగ్రేషన్‌ చట్టంలో నైపుణ్యాలు లేని, తక్కువ జీతాలకు పనిచేసే పనివారిని తెచ్చుకోవడం పెద్దఎత్తున పెరగనుందని చెప్పారు. కార్యాలయేతర(బ్లూకాలర్‌), వ్యవసాయేతర పనులు చేసేవారికి(రెస్టారెంట్లు, నిర్మాణ రంగం, ట్రక్‌ డ్రైవింగ్‌..) ఈ నిర్ణయం వల్ల లబ్ధి చేకూరవచ్చన్నారు. అయితే ఇప్పటికే అమెరికాలో చాలా మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారని, ఈ కోటా పెంపుతో చిన్న ఉద్యోగాలకు సైతం ఇకపై అమెరికన్లు ఎక్కువ పోటీ ఎదుర్కొనవలసి రావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary

American Government decided to increase quota of H-2B visa for foreign workers by 400 per cent. With this increasing of H-2B visas will raise from 66,000 to 250,000