అమెరికాలోను ప్రియాంక అదుర్స్

America Peoples Choice Award To Priyanka

10:23 AM ON 9th January, 2016 By Mirchi Vilas

America Peoples Choice Award To Priyanka

బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అమెరికాలోని ఒక టీవీ సీరియల్ కు ఎంపికైంది.అమెరికన్ టీవీ థ్రిల్లర్ క్వాంటికోలో ప్రియాంక చేసిన పాత్రకు విశేష ఆదరణ లభించింది దీనికి గాను ప్రియాంక 2016 పీపుల్స్ ఛాయస్ అవార్డు ను గెలుచుకుంది. " క్వాంటికో " సిరీస్ లో ఎఫ్.బీ.ఐ ఏజెంట్ పాత్రలో ప్రియాంక కనిపించింది. అందులో ఆమె పేరు అలెక్ పారిష్. ఈ అవార్డుకు ఎమ్మా రోబెర్ట్స్ , జామీ లీ కర్పిస్ , లీ మిచెల్ , గే హోర్దన్ వంటి వారు పోటి పడగా ఆకరికి ఈ అవార్డు ప్రియాంకను వరించింది. చాలా మంది హాలీవుడ్ స్టార్స్ ని దాటుకుని పీపుల్స్ ఛాయస్ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ గా ప్రియాంక నిలిచింది.

ఈ అవార్డు గెలవడం నిజంగా నా అదృష్టం , నాకు ఓట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అంది ప్రియాంక తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

English summary

Bollywood Top Heroine priyanka chopra won Aerics people choice award 2016 for her Qwantiko serial.She plays as a FBI agent in that serial