ఓ వైపు మంటలు.. మరోవైపు కేకలు.. షాకింగ్ వీడియో

American airlines flight catches fire at chicago airport

05:10 PM ON 31st October, 2016 By Mirchi Vilas

American airlines flight catches fire at chicago airport

ఈమధ్య విమాన ప్రమాదాలు విచిత్రంగా జరిగిపోతున్నాయి. తాజాగా విమానంలో ఓ వైపు మంటలు.. ఇంకోవైపు ప్రయాణికులు కేకలు.. ఆ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కొన్ని నిమిషాలసేపు ప్రయాణికులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని సాగిన షాకింగ్ ఈ వీడియా ఇది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే.. అది చికాగో ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.. సమయం.. రాత్రి 2.45 నిమిషాలు.. 170 మంది ప్రయాణికులతో టేకాఫ్ అవుతున్న ఎయిర్ లైన్స్ లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి, అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది గాయాల పాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంజిన్ లో తలెత్తిన సమస్యతో కేవలం 10 నుంచి 15 సెకన్లలోనే విమానం అంతటా మంటలు వ్యాపించాయి. కుడివైపునున్న ప్రయాణికులందరూ కూడా ఎడమవైపు పడిపోయినట్టు ఓ ట్రావెలర్ చెప్పుకొచ్చింది. డోర్లు తెరవాలంటూ ఓ వైపు ప్రయాణికులు గట్టిగా కేకలు.. ఇంకోవైపు మంటలు క్రమంగా విమానం అంతటా వ్యాపిస్తున్నాయి. పరిస్థితి గమనించిన పైలట్లు.. వెంటనే ఎమర్జెన్సీ స్లైట్ ద్వారా ప్రయాణికులందరినీ బయటికి పంపించారు. మొత్తానికి ప్రయాణికులు అందరూ దిగిపోవడంతో విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

English summary

American airlines flight catches fire at chicago airport