జంతు ప్రేమ అతన్ని కదిలించింది

American Man Gifts Artificial Leg To ShaktiMan

11:56 AM ON 16th April, 2016 By Mirchi Vilas

American Man Gifts Artificial Leg To ShaktiMan

పర్యావరణం , జంతు ప్రేమ అంశాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. మనతో పాటూ పశు పక్ష్యాదులు , సకల జీవ రాసులూ సుఖంగా జీవిస్తేనే పర్యావరణ సమతుల్యత వుంటుంది. అందుకే జంతు ప్రేమికులు పెరిగారు. అంతేకాదు, ఎంత దూరాన వున్నా , జంతు ప్రేమ కదిలిస్తుంది మనసుంటే ఎంత పెద్దపనైనా చిన్నదిగా కనిపిస్తుంది. ఆవిధంగా భారతదేశంపై అతడికి ఉన్న అభిమానం... జంతువులపై ప్రేమ.. సుమారు 12 వేల కిలో మీటర్ల దూరం కూడా తక్కువగానే అనిపించింది. ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లోని ఒక పోలీసు గుర్రానికి కృతిమ కాలు ఆవసరం అని తెలియగానే 54 ఏళ్ల వయసులోనూ సొంత ఖర్చులతో భారత్‌కు కృత్రిమ కాలుని టిమ్‌ అనే అమెరికన్‌ తీసికొచ్చాడు.

ఇవి కూడా చదవండి:'గౌతమి పుత్ర శాతకర్ణి' కోసం రూ 12 కోట్ల నగలు

గత నెలలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన దాడిలో డెహ్రాడూన్‌లోని ‘శక్తిమాన్‌’ అనే పోలీసు గుర్రానికి కాలు విరిగిన సంగతి తెల్సిందే. సదరు గుర్రం తీవ్రంగా గాయపడడంతో వైద్యులు శస్త్రచికిత్స కాలు తొలగించారు. చాలామంది జంతు ప్రేమికులు దీనిపై తీవ్రంగానే స్పందించారు. దీంతో ‘శక్తిమాన్‌’ కాలు లేకుండా బాధపడడం చూసిన వైద్యుడు జమై వైఘన్‌ దాని పరిస్థితిని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. దానికి అమెరికాలోని వర్జీనియా నుంచి కృత్రిమ కాలు తేవాలని, అది కొరియర్‌లో రావాలంటే 10 రోజులు పైనే పడుతుందని పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ను చూసిన టిమ్‌ తన సొంత ఖర్చులతో వర్జీనియా వెళ్లి కృత్రిమ కాలు కొనడమే కాదు ఏకంగా భారతకు వచ్చేసాడు. ఈ నెల 9న డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన ఆ తర్వాత రోజు ‘శక్తిమాన్‌’కు శస్త్రచికిత్స ఆయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. శస్త్రచికిత్స తర్వాత టిమ్‌ ఏంటో హ్యాపీ ఫీలయ్యాడు. గతంలో అనేక సార్లు భారతకు వచ్చా. ఇక్కడి సంప్రదాయాలన్నా.. ఈ దేశమన్నా నాకు ఎంతో గౌరవం. అలాగే జంతువులపై తనకున్న ప్రేమ ఇంత దూరం వచ్చేలా చేసింది' అని తెగ సంబర పడిపోతూ చెప్పాడు. జంతు ప్రేమ ఇతన్ని ఖండాతరాలను దాటించింది.

ఇవి కూడా చదవండి:

సెక్స్ చేయమని రోడ్డుపై నగ్నంగా చిందులేసిన మహిళ (వీడియో)

కన్న కూతురికి విషమిచ్చి చంపేశారు

రాశిఖన్నా నడుం పై నాని కామెంట్స్

English summary

An American Name Tim Gifted An Artificial Limb for Shaktiman horse which was injured in A MLA Attack and Lost its Leg. He gifted this leg for free of cost.