హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోలేదా?

American Researcher Says That Hitler Did Not Comitted Sucide

04:45 PM ON 9th January, 2016 By Mirchi Vilas

American Researcher Says That Hitler Did Not Comitted Sucide

జర్మన్ నియంత, నాజీ నాయకుడు అడాల్ఫ్‌ హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోలేదా..? అప్పట్లో దొరికిన మృతదేహం హిట్లర్ ది కాదా..? దీనికి అవుననే సమాధానం ఇస్తున్నాడు అమెరికా చెందిన వార్ క్రైం పరిశోధకుడు, మాజీ సీఐఏ ఏజెంట్ జాన్‌ సెన్సిష్‌ పేర్కొన్నారు. ఇటీవల బహిర్గతమైన హిట్లర్‌ దస్త్రాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. హిట్లర్‌ తన భార్యతో కలిసి సెనరీ ద్వీపానికి పారిపోయారని.. అయితే అక్కడ ఆయన ఆత్మహత్యకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. సెనరీ ద్వీపం నుంచి ఆయన అర్జెంటీనా వెళ్లి అక్కడ జీవించారని జాన్‌ అంటున్నారు. అందరూ అనుకున్నట్లు హిట్లర్‌ తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోలేదన్నారు. హిట్లర్‌ మృతదేహం వివరాల ఆధారంగా తాను ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా హిట్లర్‌ పొడవు 5 అడుగుల ఆరు అంగుళాలని.. అయితే హిట్లర్‌ మృతదేహం మాత్రం అందుకు ఐదు అంగుళాలు తక్కువగా ఉందన్నారు. దీనిపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

English summary

Ex-CIA agent Bob Baer does not believe Hitler's death story is conclusive.