కలాం పేరిట యూఎస్ వర్సిటీ ఫెలోషిప్..

American University announces APJ Abdul Kalam Fellowship

07:20 PM ON 18th December, 2015 By Mirchi Vilas

American University announces APJ Abdul Kalam Fellowship

భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న పురస్కారగ్రహీత ఏపీజే అబ్దుల్ కలాంకు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం తనదైన శైలిలో నివాళులర్పించింది. ఆయన గతంలో తమ యూనివర్సిటీని సందర్శించడాన్ని గౌరవిస్తూ ఆయన పేరిట డాక్టోరియల్ గ్రాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం ఫెలోషిప్ అని దానికి పేరు పెట్టింది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాను కలాం 2012లో సందర్శించారు. ఆ సమయంలో ఆయన వర్సిటీ బృందంపై తనదైన ముద్ర వేశారు. ఆ సందర్భాన్ని గౌరవిస్తూ ఏకంగా రూ.1,03,71,660ల ఫెలోషిప్ ను ప్రారంభించింది సదరు వర్సిటీ. శాస్త్రసాంకేతిక రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్ డీ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఫెలోఫిప్ ను అందిస్తారు. అబ్దుల్ కలాం పేరిట ఫెలోషిప్ ను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. 2016-17 నుంచి ఈ ఫెలోషిప్ అందించనున్నారు.

English summary

The University of South Florida (USF) has announced a post graduate fellowship in the name of former president Dr. APJ Abdul Kalam to support accomplished and talented Indian students looking to study abroad