ట్రంప్ దారికొస్తున్న అమెరికన్లు

Americans are coming into Trump way

05:32 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Americans are coming into Trump way

ఇన్నాళ్ళూ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నానుతున్న ట్రంప్(అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్న) తాజాగా అమెరికన్లను తనవైపుకు తిప్పుకునే అస్త్రం ప్రయోగించారు. దీంతో అమెరికన్లు ట్రంప్ దారికి వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా సెంట్రల్ ఫ్లోరిడా ఒర్లాండ్ సిటీలోని గే నైట్ క్లబ్ లో ఉన్మాది ఒమర్ మతీన్ కాల్పులు జరిపి 53 మంది అమెరికన్లను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో మరోసారి ట్రంప్ వాదం తెరపైకి వచ్చింది. ముస్లింలను దేశంలోకి రానీయకుండా నిషేధం విధిస్తానన్న అంశం పై అమెరికాలో మళ్లీ చర్చ మొదలైంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కఠినంగా వ్యవహరించాలన్న ట్రంప్ వాదంతో అంతా ఏకీభవిస్తున్నారు.

ఎన్నికల సమయంలో జరిగిన మారణకాండ కావడంతో ఇస్లామిక్ ఉగ్రవాదం పై కఠిన వైఖరితో వెళ్లాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నెటిజన్లు ఇస్లామిక్ ఉగ్రవాదం పై విరుచుకుపడుతున్న ట్రంప్ కు మద్దతు పలుకుతున్నారు. ట్రంప్ ను బలపరిచేవారి అమెరికన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో హిల్లరీ విజయావకాశాలను దెబ్బతీసి ట్రంప్ అధికారం దక్కించుకున్నా ఆశ్చర్యపడనవసరం లేదని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మొత్తానికి భలే అస్త్రం దొరికింది ట్రంప్ కి అని విశ్లేషకులు అంటున్నారు.

English summary

Americans are coming into Trump way