అమీర్‌ దేశాన్ని వదిలిపోతాడా

Amir Khan To Leave India

11:37 AM ON 24th November, 2015 By Mirchi Vilas

Amir Khan To Leave India

మత సహనంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వివాదం అంతా ఇంతాకాదు. బాలీవుడ్‌ ఖాన్‌లు సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ల తర్వాత ఇప్పుడు తాజాగా అమీర్‌ఖాన్‌ కూడా మత సహనంపై తమ గళాన్ని విప్పారు. దేశంలో ఉన్న తాజా పరిస్థితుల దృష్ట్యా తాను చాలా ఇబ్బంది పడుతున్నానని తన మనోభావాన్ని వెల్లడించారు అమీర్‌ఖాన్‌. దీనికి తన భార్య కిరణ్‌ రావు దేశం వదిలి పెట్టి వెళదామా అని అడిగిందట అమీర్ఖాన్ను. ఒక అవార్డు ఫంక్షన్‌లో పాల్గన్న అమీర్‌ఖాన్‌ మత సహనంపై పెరిగిపోతున్న వివాదాలపై స్పందించారు. ఖురాన్‌ పట్టుకున్న మారణహోమం చేస్తున్న వాడిని ముస్లిం అనరని, టెర్రరిస్ట్‌ అంటారని అన్నాడు. తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న సాహితీవేత్తలను సైతం ఈ సందర్భంగా వెనకేసుకువచ్చాడు అమీర్‌ఖాన్‌. సమాజంలో నెలకొని ఉన్న అనిశ్చితి వాతావరణంపై స్పందించాల్సిన బాధ్యత హక్కు అలాంటి ప్రముఖ వ్యక్తులకు ఉందని, వాళ్ళకు తమ మద్ధతును ప్రకటించాడు.

గత ఎనిమిది నెలలుగా తాను ఆందోళనకు గురవుతున్నట్లు, తరచూ మీడియాలో వస్తున్న వార్తలను విశ్లేషిస్తుంటే తనకు అసంతృప్తి, అభద్రత భావం కలుగుతున్నట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని తన భార్యతో చర్చించినపుడు తాను కూడా ఇండియా వదిలి వెళ్ళి పోదామా అన్న భావన వ్యక్తిం చేసిందట.

ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల్లో అశాంతి, అభద్రతభావాలు మేల్కనకుండా చూడాలని, సమాజంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ మరింత పటిష్టంగా ఉండాలన్న భావాన్ని అమీర్‌ఖాన్‌ వ్యక్తం చేసాడు. ఇప్పుడు తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై మేధావులు తమ ఆలోచనలను వ్యక్తం చేసే పనిలో భాగంగానే అవార్డులను తిరిగి ఇచ్చేశారని ఇందులో తప్పు పట్టడానికి ఏమీలేదన్న అమీర్‌ఖాన్‌ వారికి తమ మద్ధతు ప్రకటించాడు. ప్రజలు శాంతియుతంగా తమ ఆందోళనలను చేయడంలో తప్పులేదని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంతో అసలు సమస్య ఉత్పన్నమవుతుందని అన్నాడు. త్వరలోనే ప్రస్తుతమున్న అనిశ్చిత వాతావరణం తొలగిపోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

English summary

Amir khan to quit India. Amir khans's says that his wife suggested him to leave India due to rise of intolerance in the country.