5 మోడీ సర్టిఫికెట్లు ఇవిగో...అవీ నకిలీవేనా ?

Amit Shah Shows Narendra Modi Educational Certificates

11:08 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Amit Shah Shows Narendra Modi Educational Certificates

దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధానమంత్రి విదార్హత సర్టిఫికెట్స్ పై వివాదం అలుముకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో వివాదం నేపధ్యంలో ఇప్పటికే మోడీ విద్యార్హతల గురించి గుజరాత్ యూనివర్శిటీ వివరణ ఇచ్చింది. తాజాగా బిజెపి అధ్యక్షుడు..మోడీ సన్నిహితుడు అయిన అమిత్ షా రంగంలోకి దిగారు. మోడీ విద్యార్హతలు వెల్లడించి..అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించడం కోసం ఆయన ప్రెస్ మీటే పెట్టారు. మోడీ బీఏతో పాటు పీజీ కూడా చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను కూడా ఆయన మీడియాకు చూపించారు. బీఏ డిగ్రీని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో పీజీని గుజరాత్ విశ్వవిద్యాలయంలో మోడీ పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. మోడీ విద్యార్హతల గురించి సందేహాలు లేవనెత్తిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెంపలేసుకుని, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

‘‘ఒకరి వ్యక్తిగత విషయాల పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలేంటో తెలుసుకోవాలి. మోడీ విద్యార్హతలను నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి’’ అని అమిత్ షా అన్నారు. ఐతే అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. షా చూపించిన డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని.. కావాలంటే డిగ్రీ సర్టిఫికెట్.. మార్కుల జాబితాలో తేడాలను గమనించవచ్చని.. రెండింట్లో మోడీ పేరులో తేడా ఉందని పేర్కొంది. మోడీ విషయంలో తాము క్షమాపణలు చెప్పడం కాకుండా, తప్పుడు సర్టిఫికెట్లు చూపించినందుకు వాళ్లే క్షమాపణలు కోరాలని అమ్ ఆద్మీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:రవిశంకర్ పై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

English summary

Delhi Chief Minister Demanded to Reveal The Educational Qualifications of Prime Minister Of India Narendra Modi and yesterday BJP Senior Leader Amit Shah revealed they the educational certificates of Modi and demanded Aravind Kejriwal to Say sorry to Indian People. AAP Leaders said that they were duplicate certificates.