గూగుల్‌కు అమిత్‌ సింఘాల్‌ గుడ్ బై

Amit Singhal says good bye to google

05:08 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Amit Singhal says good bye to google

ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి భారత సంతతికి చెందిన టాప్‌ ఎగ్జిక్యుటివ్ అమిత్‌ సింఘాల్‌ తప్పుకోనున్నారు. గూగుల్‌ సెర్చ్‌ విభాగంలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన అమిత్‌ ఫిబ్రవరి 26న గూగుల్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గూగుల్‌ గ్లోబల్‌ సిస్టమ్‌ తొలి రోజుల్లో సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ఇంజనీర్లలో అమిత్‌ ఒకరు. అమిత్‌ స్థానంలో జాన్‌ గియాన్నాండ్రియాను నియమించనున్నారు. ప్రస్తుతం జాన్‌ ఆల్ఫాబెట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన అమిత్‌ సింఘాల్‌(48)2000లో గూగుల్‌లో చేరారు. భారత్‌లోని ఐఐటీ రూర్కీలో కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీలో ఎంఎస్‌, కార్నెల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పట్టాలు పొందారు. గూగుల్‌కు ముందు ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌లో పనిచేశారు. గూగుల్‌లో చాలాకాలం పాటు గూగుల్‌ ఇంటర్నెట్‌ సెర్చ్‌ చీఫ్‌గా పనిచేశారు. అమిత్‌ సింఘాల్‌ సెర్చ్‌ విభాగంలోనే చాలా ఏళ్లు పనిచేశారు. మొదట అకడమిక్‌ రీసెర్చర్‌గా తర్వాత గూగుల్‌ ఇంజనీర్‌గా పనిచేశారు.

English summary

Amit Singhal says good bye to google. February 26 will be Singhal's last day at Google and John Giannandrea, currently a vice president of engineering, will replace Singhal.