అమితాబ్ మనస్సు ఎక్కడుంది ?

Amitab Bachan About His Fans

04:31 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Amitab Bachan About His Fans

ఆలిండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ మనస్సు ఎవరికిచ్చారు ... ఎక్కడుంది .... అవునండీ! స్వయంగా అమితాబే తన మనస్సు అక్కడ ఉండిపోయింది అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అదేమంటే, అమితాబ్‌ బచ్చన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీలు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘తీన్‌’ చిత్ర షూటింగ్‌ కోల్‌కతాలో ముగిసింది. అమితాబ్‌. దాదాపు రెండు నెలల పాటు కోల్‌కతాలో తీన్‌ చిత్రం షూటింగ్‌ జరిగిన సమయంలో, అనేక సందర్భాల్లో అమితాబ్‌ పలువురు అభిమానులను కలిశారు. ఆయన తిరిగి వెళ్లిపోతున్న సమయంలోనూ ఎంతో మంది అభిమానులు ఆయనకు వీడ్కోలు పలకడానికి దారిపొడవునా వేచి ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ.. వీడ్కోలు అందుకున్నారు. . వారందరినీ విడిచి వెళ్తుంటే చాలా విచారంగా ఉందని ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. కోల్కత్తా నుంచి ముంబయిలోని తన నివాసానికి తిరిగి వచ్చినా.. ఇంకా అక్కడి సంగతులే గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు అంత ప్రేమ ఇంకెక్కడా ఉండదన్నారు. అభిమానులందరికీ కృతజ్ఞతలు తెల్పుకున్నారు.

English summary

Bollywood Big B Amitab Bachan says that during the film Shooting on "Theen" movie many fans came to him and talked to him.This movie was shooted in Kolkatta.When the shooting completed many fans of him stand on roads and gives send off to amitab bachan.Amitab says that he will never forget his fans for their support