నేషనల్ హెరాల్డ్ లో బిగ్ బి కి వాటా?

Amitabh Bachan Hand In National Herald Case

06:03 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Amitabh Bachan Hand In National Herald Case

పార్లమెంట్ సమావేశాలను ముందుకు సాగనీయకుండా కాంగ్రెస్ ఆందోళనకు కారణమైన నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఇందిర కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బిగ్ బి అమితాబ్ కి కూడా వాటా ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమె తనయుడు రాహుల్ గాంధీలకు నిద్ర లేకుండా చేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో అమితాబ్ బచ్చన్ కి కూడా సంబంధమున్నట్లు ఆరోపణలు రావడంతో దీనిపై మాట్లాడడానికి బిగ్ బి ససేమిరా అంటున్నారట. నేషనల్ హెరాల్డ్ ముద్రణ సంస్థ ఏజేఎల్ లో లక్ష షేర్లు అమితాబ్ కు చెందిన సంస్థ అభిమ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఉన్నట్లు ఓ ఛానల్ బయటపెట్టింది. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న అమితాబ్ ఇల్లు పత్రిక చిరునామాతోనే ఈ సంస్థ రిజిష్టరై ఉంది. దీంతో నేషనల్ హెరాల్డ్ లో అమితాబ్ వాటాలు కొనుగోలు చేసినట్లు రుజువైంది.

అయితే అమితాబ్ మాత్రం దీనిపై ఏమీ మాట్లాడడం లేదు. మీడియా వాళ్ళు దీనిపై గుచ్చిగుచ్చి అడుగుతున్నా ఆయన గప్ చుప్ గానే ఉంటున్నారు. ఒకప్పుడు రాజీవ్ కుటుంబంతో అమితాబ్ బాగా సన్నిహితంగా ఉండేవారన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఏజేఎల్ లో వాటాలు ఉన్నవారంతా రాజీవ్ ఇందిరాగాంధీలకు అత్యంత సన్నిహితులే కావడం విశేషం. ఏజేఎల్ కు ఇచ్చిన రుణాన్ని యంగ్ ఇండియాకు బదలాయించి సోనియా రాహుల్ లు ఆ సంస్థకు చెందిన 2 వేల కోట్లను మింగేసే ప్రయత్నం చేస్తున్నారన్నది నేషనల్ హెరాల్డ్ కేసులోని ప్రధాన అభియోగం. ఇప్పుడు ఇందులో అమితాబ్ పేరు కూడా బయటకు రావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎటు తిరిగి ఎటు దారితీస్తుందో...

English summary

Romours are coming all over in India that Bollywood Big B Amitab Bachan had also involved in National Herald Case