కోటి ఇచ్చినా ఈ డొక్కు స్కూటర్ ఇవ్వడట

Amitabh Bachchan and his scooter Story

03:44 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan and his scooter Story

సెంటిమెంట్ బలం ముందు అన్నీ బలాదూరే... అందుకే కోటి రూపాయలు ఇచ్చినా ఈ డొక్కు స్కూటర్ ఇవ్వనను గాక ఇవ్వనని అంటున్నాడు. ఎందుకంటే 20ఏళ్ల డొక్కు స్కూటర్ ఇది. సాధారణంగా దాన్ని ఏ షెడ్డులోనో పడేయడమో.. కిలోలెక్కన అమ్మేయడమో చేయడం సహజం. కానీ ఆ స్కూటర్ కోట్ల రూపాయల ధర పలుకుతోంది. అయినా.. దాని యజమాని అమ్మేందుకు ఇష్టపడట్లేదు. ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకుంటాడట. ఎందుకంటే.. అది అలాంటి ఇలాంటి స్కూటర్ కాదండోయ్. అలాగని ఎలాంటి మ్యాజిక్ లేదు. కానే అంతకన్నా ఎక్కువ సెంటిమెంట్ వుంది. ఇంతకీ ఏమిటంటారా? బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నడిపిన స్కూటర్ ఇది.

ఓసారి వివరాల్లోకి వెళ్తే, అమితాబ్ బచ్చన్.. నవాజుద్దీన్ సిద్ధిఖీ.. ప్రత్యేక పాత్రలో విద్యాబాలన్ కలిసి నటిస్తున్న ‘తీన్’ చిత్రం టైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్లో అమితాబ్ సామాన్య వ్యక్తిలా నీలిరంగు స్కూటర్ నడుపుతూ.. కనిపిస్తాడు. ఈ స్కూటర్‌పైనే కోల్‌కతా అంతా తిరిగేశాడు. ఇందులో స్కూటర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘తీన్’ సినిమా కోసం దీన్ని కోల్‌కతాలోని సెకండ్ హ్యాండ్ వాహనాలను అమ్మే సుజిత్ నారాయణ్ సుర్ దగ్గర తీసుకున్నారట. తన అభిమాన నటుడి కోసమని తెల్సి, అమితాబ్‌కు సరిపోయేలా కొన్ని మార్పుల చేసి మరీ ఈ స్కూటర్‌ను చిత్రబృందానికి సుజిత్ ఇచ్చాడు. అయితే చిత్రీకరణ పూర్తయ్యాక స్కూటర్‌ను సుజిత్‌కి తిరిగి ఇచ్చేశారు. ఇక అప్పుడు దీని వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది.

ఎందుకంటే, అమితాబ్ నడిపిన స్కూటర్ కదా... అందుకే దానికి కోటి రూపాయలు ఇస్తామని కొందరు ముందుకొచ్చారట. అయినా అమ్మడానికి సుజిత్ ఇష్టపడలేదు. ‘‘బిగ్‌బీ నడిపిన స్కూటర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. దానికి వెల కట్టలేం’’ అని అంటున్నాడు. స్కూటర్‌ను ఇంట్లోనే పెట్టి.. దాని పక్కనే అమితాబ్ పెద్ద ఫోటో ఏర్పాటు చేస్తానని ఎట్టి పరిస్థితిలోనూ అమ్మేది లేదని స్పష్టం చేస్తున్నాడు. కోట్లిస్తామన్నా ఆ డొక్కు స్కూటర్‌ను అమ్మేందుకు నిరాకరించిన సుజిత్‌కు అమితాబ్ అంటే అలాంటి ఇలాంట్ అభిమానం కాదని తెలుస్తోంది కదా.

ఇది కూడా చూడండి :తాతకు 'జనతా గ్యారేజ్' నివాళి

ఇది కూడా చూడండి :మహాభారతంలో పరీక్షితుడు గురించి మీకు తెలుసా!

ఇది కూడా చూడండి :అమ్మో, 40రోజుల్లో రూ 100 కోట్ల సంపాదనా?

English summary

Amitabh Bachchan and his scooter Story.