ఫ్లింటాఫ్ కు అమితాబ్ ఝలక్

Amitabh Bachchan Counter To Flintoff

03:15 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan Counter To Flintoff

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ లో కోహ్లి తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలుపుతో సెమిస్ బెర్త్ ఖాయం చేసుకున్న అనంతరం కోహ్లి పై అనేక మంది సెలెబ్రెటీలు పొగడ్తల వర్షం కురిపించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుడా విరాట్ కోహ్లి పై ప్రశంసల కురిపించాడు.

ఇవి కూడా చూడండి : ధోని,కోహ్లి లకు నగ్న ఫోటోలు పంపిన మోడల్(ఫోటోలు)

అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా కోహ్లి నిజం గా ఓ జీనియస్ , తమకు ఇలాంటి ఆనందకరమైన రాత్రులను మరిన్ని ఇవ్వాలని , సమయానికి తగినట్లు వ్యవహరించి ఇంత ఆనందకరమైన రాత్రిని మాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు . ఇలాంటి రాత్రులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసాడు.

అమితాబ్ చేసిన ట్వీట్ ఇలా ఉంటే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్ స్పందిస్తూ "విరాట్ కోహ్లి ఇలాంటి ఆట తీరును కొనసాగిస్తే డో ఒక రోజు నువ్వు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ రూట్ అంతటివాడివి అవుతావు " అంటూ ఒక పక్క కోహ్లి ని పొగుడుతూనే మరో పక్క కోహ్లి కి చురకలు అంటించే ప్రయత్నం చేసాడు. ఫ్లింటాఫ్ త్వ్వేట్ పై విరాట్ కోహ్లి అభిమానులు ఫ్లింటాఫ్ పై ఎదురు దాడి కి దిగుతున్న సమయంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎంటర్ అయ్యి "రూట్ (చెట్టు వేరు) ఏంటి రూట్ ? రూట్ ను మొదళ్ళతో సైతం పీకి పారేస్తాం " అంటూ కౌంటర్ ఇచ్చాడు .

ఇవి కూడా చూడండి :ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్

ఇలా అమితాబ్ బచ్చన్ ట్వీట్ కి స్పందించిన ఫ్లింటాఫ్ అమితాబ్ కు "ఇంతకి మీరు ఎవరు" అంటూ రివర్స్ పంచ్ వేసే ప్రయత్నం చేసాడు. అమితాబ్ పై పంచ్ వేస్తే అభిమానులు ఊరుకుంటారా..! ఇక వెంటనే ఫ్లింటాఫ్ ట్వీట్ కు అభిమానులు స్పందిస్తూ గంగులు లార్డ్స్ మైదానంలో చొక్కా విప్పడం , యువీ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు వంటి సంఘటనలను గుర్తు చేస్తూ ఫ్లింటాఫ్ నూట మాట రాకుండా చేసారు.

అభిమానులు అంతటితో ఆగకుండా అమితాబ్ మీ తండ్రి లాంటి వారు. పేరు షేహన్ షా అని ఒక అభిమాని , వెళ్లి మీ దేశం లోని టుసాడ్స్ మ్యూజియం కు వెళ్లి చూడు . మీ దేశం (ఇంగ్లాండ్ )లో నీకన్నా అమితాబ్ నే ప్రముఖుడు అంటూ ఫ్లింటాఫ్ కు అమితాబ్ ను పరిచయం చేసారు. ఇలా తమ అభిమాన నటుడిని ఎవరు అంటే ఊరుకోమంటూ అభిమానులు ఫ్లింటాఫ్ ను హెచ్చరించారు.

ఇవి కూడా చూడండి :

ఊపిరికి ఫోర్బ్స్ ప్రశంసలు

కొడుకు ఫీజు(500) కట్టడం కోసం ఓ పేద తండ్రి సాహసం!

మోడీ వార్నింగ్ తో మాల్యాకు తిప్పలు తప్పవా ?

నగ్నంగా నటించడానికి నేను రెడీ..

English summary

Bollywood Big B Amitabh Bachchan gives Counter to Flintoff who tried to troll Virat Kohli on Twitter.Flintoff also Tried to give reverse counter to Abitabh Bachchan and Fans came into action and gives counter attack to Flintoff.