రోడ్లపై స్కూటర్‌తో షికార్‌ చేస్తున్న బిగ్‌బి!!

Amitabh Bachchan driving scooter in kolkata roads

06:16 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Amitabh Bachchan driving scooter in kolkata roads

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌ తాజాగా బెంగాలీ డైరెక్టర్‌ అయినా దాస్‌ గుప్తా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం బిగ్‌బి ఒక డొక్కు స్కూటర్‌ ఎక్కాడు. కోల్‌కతాలోని రేస్‌ కోర్స్‌రోడ్‌లో సహనటుడు నవాజుద్దీన్‌తో కలిసి స్కూటర్‌ నడిపారు. బిగ్‌బి మాట్లాడుతూ బహుల్‌ సమయ్‌ బాద్‌ కోల్‌కతాకే సడక్‌పర్‌ స్కూటర్‌ చలాయా (చాలా కాలం తర్వాత కోల్‌కతాలో స్కూటర్‌ నడిపాను) ఈ స్కూటర్‌ పై నావెనుకనవాజుద్దీన్‌ సాబ్ కూర్చున్నారు. కొల్‌కతాలో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు అని అమితాబ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

1960 సంవత్సరం ముందు అమితాబ్‌ జీవితం కోల్‌కతాలోనే గడిచింది. అప్పట్లో ఇక్కడే తను పనిచేశానని, నటునిగా నా లైఫ్‌ జీవితం ఇక్కడే మొదలైందని అమితాబ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఘాటింగ్‌ మధ్యలో కాస్త విశ్రాంతి దొకరగానే సెట్స్‌లోనే ఓ స్ట్రెచర్‌ లాంటి దానిపై కొద్దిసేపు ఇలా వాలిపోయారు.

English summary

Amitabh Bachchan driving scooter in kolkata roads for his new movie directing by Daas Gupta.