రోబో-2లో అమితాబ్?

Amitabh bachchan in Robo-2?

03:54 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Amitabh bachchan in Robo-2?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన రోబో చిత్రం ఎంతటి ఘన విజయం సాథించిందో మనందరికి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కనక వర్షం కురిపించింది. ఈ చిత్ర దర్శకుడు శంకర్‌ రోబో చిత్రానికి కొనసాగింపు తియ్యాలని సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని ఇందులో ఒక ముఖ్యమైన పాత్రకోసం అమితాబచ్చన్‌ని శంకర్‌ కలిసారు. రజనీకాంత్‌ అమితాబచ్చన్‌కి బయట మంచి స్నేహబంధం ఉందని తెలిసిందే. ఇందుకు సానుకూలంగా అమితాబ్‌ ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారని తెలిసింది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ ప్రతినాయకుడిగా నటించబోతున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఆర్నాల్డ్‌ వల్ల బడ్జెట్‌ ఇంకా పెరిగిపోతుందని ఆయనని తప్పించి వేరొకరిని తీసుకోబోతున్నారని తాజా సమాచారం. రోబో-2 ప్రీ ప్రొడక్షన్‌ పనులు, నటీనటులు ఎంపిక విషయంలో శంకర్‌ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాని కి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

English summary

Amitabh bachchan in Robo-2? Super Star RajniKanth's super hit movie robo. The continuation of robo is now taking as a robo-2.