బిగ్ బి రాష్ట్రపతా!?

Amitabh Bachchan is President of India

06:05 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan is President of India

అవునా, దేశ అత్యున్నత పదవి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బిగ్ బి అమితాబ్‌బచ్చన్‌ ను వరించనుందా? ఇది ఏమైనా సినిమాలోనా, అంటే కాదనే వాదన వినిపిస్తోంది. భారత రాష్ట్రపతి పదవి బిగ్ బి కి వస్తుందనే సంకేతాలే వినిపిస్తున్నాయి. భారత రాష్ట్రపతి పదవికి స్వయంగా ప్రధాని మోడీ యే అమితాబ్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. పైగా ఒకప్పుడు సమాజ్ వాది పార్టీలో ఓ దశలో చక్రం తిప్పిన ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పారట. అంతేకాదు, మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమితాబ్ పరిచయం చేశానని.. అనంతరం ఓ సినిమా కోసం ఇద్దరూ సమావేశమయ్యారని..

అప్పుడు గుజరాత్‌ అంబాసిడర్‌గా పని చేయాల్సిందిగా అమితాబ్‌ను మోడీ కోరారని అమర్‌సింగ్‌ వివరించారట. గతంలో కూడా ఈ విషయం పై చర్చలు జరిగాయి. మరి రాష్ట్రపతి పదవి అమితాబ్ ను వరిస్తుందో లేదో చూడాలి.

English summary

Amitabh Bachchan is President of India. Bollywood Big B Amitabh Bachchan is as a President of India.