మోడీని అధిగమించిన బిగ్ బి

Amitabh Bachchan reaches 2 crore followers in Twitter

11:36 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan reaches 2 crore followers in Twitter

పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియాలోనూ స్టార్లుగా మారిపోతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్లకు వేదికైన ట్విట్టర్ లో సెలబ్రిటీల జోరు మామూలుగా లేదు. నరేంద్ర మోడీ పొలిటీషియన్లు ట్విట్టర్ లో దూసుకుపోతుండగా. పలువురు కేంద్రమంత్రులు , ప్రజాప్రతినిధులు కూడా తమ హవా సాగిస్తున్నారు. ఇక బాలీవుడ్ దిగ్గజం బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ట్విట్టర్ లో కింగే. తాజాగా ఆయన ట్విటర్ లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ట్విట్లర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరుకుందట. దీంతో తాజా లెక్కలతో బిగ్ బీ అమితాబ్ ట్విట్టర్ లో సెలబ్రిటీల విభాగంలో టాప్ లో నిలిచారు. అంతేకాదు ఇంతవరకు టాప్ లో ఉన్న మోడీని కూడా అమితాబ్ దాటేశాడట మోడీ ప్రస్తుతం కోటీ 88 లక్షల మంది ఫాలోవర్లను కలిగి వుంటే, అమితాబ్ ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరింది. ఈ ర్యాంకింగుల పై అమితాబ్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. ‘‘థాంక్యూ ఆల్... ఇక 3 కోట్ల దిశగా వెళ్లాలి’’ అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాలానికి అనుగుణంగా అప్ డేట్ అయ్యే అమితాబ్ ఆ టార్గెట్ కూడా రీచవుతారని అనుకుంటున్నారు. నిత్యం ట్విట్టర్ వేదికగా అనేక విషయాలు షేర్ చేసుకునే ఆయన 3 కోట్ల మార్కును త్వరలో రీచవుతారని భావిస్తున్నారు. మరి మోడీ ఆయన్ను బీటవుట్ చేస్తారో లేదంటే సెకండ్ ప్లేస్ కే పరిమితం అవుతారో చూడాలి. మొత్తానికి ఈ సెలబ్రిటీలు చేసే ట్వీట్ లే వార్తలుగా మారుతున్నాయి.

బ్రస్సెల్స్లో భారతీయుడు మిస్ అయ్యాడు

ఫ్రెండ్‌ భార్యతో సెక్స్‌ వీడియో విలువ 700 కోట్లు!

అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ ఫైర్‌

నాగ్ చెప్పిన ఊపిరి రహస్యాలు

English summary

Big B Amitabh Bachchan creates a new record in India. Amitabh Bachchan Crosses Two Crore followers and crosses a new milestone.Indian Prime Minister Narendra Modi was in Second Position After Amitabh Bachchan.