అలా షికారు కెళ్ళిన సూపర్ స్టార్ లు

Amitabh Bachchan Roaming On Delhi Roads

10:53 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan Roaming On Delhi Roads

వాళ్ళకీ అందరి మాదిరిగా రోడ్డు మీద షికారు చేయాలని తారలకు వుంటుంది. పెద్ద స్టార్లు , సూపర్ స్టార్లు రోడ్డు పై నడిస్తే , ఇక అభిమానులు వదులుతారా? వదలనే వదలరు కదా. అందుకే తారల పాట్లు తారలవి , వాళ్ళ కష్టాలు వాళ్ళవి. అందుకే కొందరు హీరోలు అప్పుడప్పుడు ఏ మారువేషంలోనో ఇలాంటి  సరదాలు తీర్చుకుంటారు. సరిగ్గా  అలాగే  బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేసాడు.  అమితాబ్‌ తో నిర్మాత సూజిత్‌ సర్కార్‌  "ఆగ్రా కా దాబ్రా" సినిమా తీస్తున్నారు. డిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అనిరుద్ద రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ  సినిమా షూటింగు కోసం డిల్లీ వెళ్లిన అమితాబ్‌ ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా వుండే చొక్కా ధరించి ముఖాన్ని కవర్‌ చేసే టోపీ కూడా ధరించి క్రిక్కిరిసి వుండే డిల్లీ ప్రధాన వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే ఎవరూ ఆ సమయంలో బిగ్ బి ని  గుర్తుపట్టలేదు. ఈ విషయాన్ని అమితాబ్‌ ట్వీట్‌ చేస్తూ, "ఆ సమయంలో  నాకు తోడుగా ఒక వీధి కుక్క మాత్రం నడిచింది" అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. తనను గుర్తుపట్టని విధంగా మేకప్‌ చేసిన వ్యక్తిని అభినందించుకుంటూ తాను బాలీవుడ్‌కు రాకముందు తిరిగిన వీధిని బిగ్ బి అలా చుట్టబెట్టేశాడు.

ఇక అమితాబ్‌ లాగే మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా బెంగళూరులో తన స్నేహితుల్ని, తను నిత్యం ఆరాధించే దేవాలయాన్ని చూడాలనిపిస్తే మారువేషంలో వెళుతుంటారు. స్టార్‌ డమ్‌ రావడం వల్ల కానీ, లేకపోతేనా... బెంగళూరు వీధుల్లో డ్యాన్స్‌ చేస్తూ తిరిగేవాడిని’’ అంటూ రజనీకాంత్‌ చెబుతున్నాడు. మొత్తానికి రాజుల పాలనలో రాజులు మారు వేషంలో తిరుగుతూ ప్రజలు తమ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే వారట. మరి ఈ సూపర్ స్టార్ లు మాత్రం తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు ఇలా మారువేషంలో తిరుగుతూ రోడ్లు చుట్టేస్తున్నారు. 

అమితాబ్ ఢిల్లీ రోడ్ల పై తిరిగిన ఫోటోలను స్లైడ్ షోలో చూడండి.....

1/5 Pages

ఒంటరిగా

అనిరుద్ద రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న "ఆగ్రా కా దాబ్రా" సినిమా షూటింగు కోసం డిల్లీ వెళ్లిన అమితాబ్‌ ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా వుండే చొక్కా ధరించి ముఖాన్ని కవర్‌ చేసే టోపీ కూడా ధరించి క్రిక్కిరిసి వుండే డిల్లీ ప్రధాన వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాడు.

English summary

Bollywood Big B Amitabh Bachchan roamed on Delhi roads with a face mask oh his face.No one recognised him and Amitabh Bachchan says that he felt very happy for roaming on roads and he said thanks to the make up man who did like this.