30 ఏళ్ల తర్వాత బిగ్ బి సారీ చెప్పాడు.. ఇంతకీ ఏ తప్పు చేసాడట

Amitabh Bachchan Said Sorry To Allahabad People

10:56 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan Said Sorry To Allahabad People

ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే హీరోయే కాదు మూడు దశాబ్ధాల క్రితం ప్రజాప్రతినిధి కూడా. ఇందిరా గాంధీ మరణం తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా అమితాబచ్చన్ ఎన్నికయ్యాడు. అలహాబాద్ నుంచి ఆనాటి కాకలు తీరిన రాజకీయ యోధుడు హెచ్ ఎస్ బహుగుణపై విజయం సాధించి, సంచలనం సృష్టించిన అమితాబ్ ఆతర్వాత మూడేళ్లకే రాజీనామా చేశారు. తన సోదరుడు అజితాబ్ బచ్చన్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అమితాబచ్చన్ రాజీనామా చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

అయితే 30 ఏళ్ల తర్వాత ఈ విషయమై తన మనోగతాన్ని అమితాబ్ బయటపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇన్నేళ్లలో అమితాబ్ ఎప్పుడూ రాజకీయాల ప్రస్తావనే తీసుకురాని బిగ్ బి,సడన్ గా వాటి ప్రస్తావన తెచ్చారు. తాను కేవలం నటుడ్ని మాత్రమేనని, కెమెరా మందు నటించడమే తన వృత్తి అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో తన దృష్టిని ఏ ఇతర అంశాలపైనా మళ్లించాలని అనుకోవడంలేదంటూ స్పష్టం చేశారు.

నన్ను ఎన్నుకున్న అలహాబాద్ ప్రజలకు ఎన్నో హామీలిచ్చా... కానీ వాటిని నెరవేర్చలేకపోయా అంటూ అమితాబచ్చన్ సారీ చెప్పారు. 1984లో రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ, మూడేళ్లలోనే రాజీనామా చేసి బయటకువచ్చానని ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుపోవడం ఇప్పటికీ తనను బాధిస్తోందని అమితాబ్ తన మనోగతాన్ని వెల్లడించారు. ఒక కార్యక్రమంలో తన మనోగతాన్ని బయటపెట్టుకున్న అమితాబ్, రాజకీయాల్లో భావోద్వేగాలకు చోటు వుండదని గ్రహించిన తర్వాత వాటిని దూరమయ్యాయనని చెప్పాడు. ఇదే సందర్భంలో గాంధీ కుటుంబంతో తన స్నేహం ఎప్పుడూ వుండేదని, ఆ కుటుంబంతో తన ఫ్రెండ్ షిప్ విషయమై మాట్లాడుతూ మేం ఫ్రెండ్స్ అంతే దానిపై ఎందుకు మాట్లాడాలి అంటూ సమాధానం దాటవేశారు.

ఐతే, ఇదే అమితాబ్ పీకల్లోతు కష్టాల్లోవున్నప్పుడు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ తోడ్పాడుతో తన బిజినెస్ నష్టాలు, కష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం మరిచిపోకూడదంటూ సోషల్ మీడియాలో అప్పుడే విమర్శలు స్టార్ట్ అయిపోయాయి. మొత్తానికి ఎక్కడో ఓ మూల అమితాబ్ ని వేధిస్తున్న సమస్యను బయట పెట్టిసి, ప్రజలకు సారీ చెప్పడం ద్వారా గుండెను తేలిక చేసుకున్నారని కొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:అక్కడ 12 ఏళ్ల వయసొస్తే తల్లి అవ్వాల్సిందే!

ఇవి కూడా చదవండి:భార్యపై అనుమానంతో తల నరికి వీధుల్లో ఊరేగించాడు.. ఆపై..

English summary

Bollywood Big B Amitabh Bachchan said sorry to the people of Allahabad for not full filling the promises he made when he become MP in 1984 elections.