బిగ్ బికి ఇప్పటికీ అదే అలవాటు

Amitabh Bachchan Says That Some Habits Never Change

10:50 AM ON 12th March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan Says That Some Habits Never Change

ఏళ్లు గడిచినా కొన్ని అలవాట్లు మారవు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంటూ ఓ ఫొటోని పోస్ట్‌ చేసాడు. దాన్లో 1975లో ‘షోలే’ చిత్రం సెట్‌లో తానున్న ఫొటో తో పాటు 2015లో ఓ ప్రకటన కోసం పనిచేస్తున్నప్పుడు దిగిన చిత్రం కలగలిపి ఉన్నాయి. ఈ ఫొటోతో పాటూకొన్ని అలవాట్లు మారవని ట్వీట్‌ చేసాడు. అసలు బిగ్‌ బి ఇలా ఎందుకన్నారూ, ఆ ఫొటోల్లోని ప్రత్యేకత ఏంటంటే..! బిగ్‌ బి ఆ రెండింట్లో కుర్చీలో కూర్చుని రెండు కాళ్లూ పైన పెట్టుకుని ఉన్నారు. విషయం ఏమంటే, కాలం మారినా అలా కూర్చునే తన అలవాటు అలాగే వుందని వివరించాడు. ఇలా వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంలో బిగ్ బి రూటే వేరబ్బా.

English summary

Bollywood Big B Amitabh Bachchan shares some of his habits on social media.Amitabh Bachchan says that he would like to sit by putting legs on the chair every time.He posted a photo on twitter by comparing two photos.