రాష్ట్రపతి పదవి గురించి బిగ్ బి షాకింగ్ కామెంట్స్(వీడియో)

Amitabh Bachchan shocking comments on President berth

12:55 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan shocking comments on President berth

బిగ్ బి అమితాబ్ బచ్చన్ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి పదవి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను వరిస్తే? అందుకు ఆయన స్పందన ఎలా వుందో మీరు చూడండి. మంగళవారం నాడు అమితాబ్ తన సంతోషాన్ని ముంబైలో అభిమానులు, మీడియాతో పంచుకున్నారు. తనపై చెక్కుచెదరని ప్రేమాభిమానులు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయనకు తన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులు, రాష్ట్రపతి పదవిపై ఆయన అభిప్రాయం వంటి పలు విషయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. అమితాబ్ ను రాష్ట్రపతి చేయాలని శత్రుఘ్నుసిన్హా వ్యాఖ్యానించడంపై అడిగినప్పుడు, శత్రుఘ్ను బాబు సరదాగా అని ఉంటారని, అలా జరగబోదని నవ్వుతూ సమాధానమిచ్చారాయన.

1/5 Pages

జవాన్లకు సంఘీభావం తెలపాలి...


సర్జికల్ దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినప్పుడు దానిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు అని అమితాబ్ సమాధానం దాటవేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న సంఘటనల పట్ల ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, తమ ప్రాణాలు త్యాగం చేసి దేశ ప్రజలను కాపాడుతున్న జవాన్లకు మనమంతా సంఘీభావం తెలపాలని సూచించారు.

English summary

Amitabh Bachchan shocking comments on President berth