లోకల్‌ ట్రైన్ లో అమితాబ్‌ హల్‌చల్‌

Amitabh Bachchan sing a song in local train

03:42 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Amitabh Bachchan sing a song in local train

సౌరబ్‌ నింబకర్‌, అతని సహచరులు రోజూ లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తూ కాన్సర్‌ బాధితులకోసం గిటార్‌ వాయిస్తూ పాటలు పాడుతూ వచ్చిన్న డబ్బులతో సేవాకార్యక్రమాలు చేసేవారు. ఇలా రోజువారీ లోకల్‌ ట్రైన్‌లో తిరుగుతూ ప్రజలనుండి డబ్బులు సేకరిస్తుండగా వారికి ఒక అనుకోని అతిధి ట్రైన్‌లో పరిచయమయ్యారు. ఆయనే బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌. ఒక్కసారిగా అమితాబ్‌ను చూసిన సౌరబ్‌ బృందం అమితాశ్చర్యాలకు గురయ్యారు. సౌరభ్‌ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న అమితాబ్‌ ఈ విధంగా సౌరబ్‌ బృందానికి ఒక్కసారిగా సర్ప్రైజ్‌ ఇవ్వడమే కాకుండా వారితో కలిపి కొన్న పాటలను కూడా పాడడం విశేషం. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ తన సెలబ్రిటీ హోదాను కూడా పక్కన్న పెట్టి సామాన్య ప్రజానీకంతో కలిసి పోయి చాలా సాదాసీదాగా ట్రైన్‌లో పాటలు పాడడం అందరినీ ఆకట్టుకుంది. చాలామంది ప్రయాణీకులు అమితాబ్‌తో కలిసి సెల్ఫీలను దిగారు. ఇప్పుడు ఈ ఫొటోలన్నీ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

English summary

Amitabh Bachchan sing a song in local train.Amitabh Bachchan travels in local mumbai train on saturday